Turmeric For Skin Care : వేసవిలో కూడా మీ చర్మం మెరవాలంటే చర్మ సంరక్షణలో దీనిని చేర్చుకోండి ?

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పసుపును నీటిలో కలిపి తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Turmeric For Skin Care : వేసవిలో కూడా మీ చర్మం మెరవాలంటే చర్మ సంరక్షణలో దీనిని చేర్చుకోండి ?

Turmeric For Skin Care

Turmeric For Skin Care : పసుపు భారతీయ మసాలా, ఇది సాధారణంగా ప్రతి భారతీయ వంటకంలో ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా పసుపు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గత కొన్నేళ్లుగా పసుపు బాగా ప్రాచుర్యం పొందింది. పసుపును కూరలలో మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు.

READ ALSO : గ్లాసుడు నీరు..చిటికెడు పసుపు..ఎన్నో ప్రయోజనాలు

చర్మ సంరక్షణలో పసుపును నీటితో కలిపి ఉపయోగించవచ్చు. పసుపు నీరు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మ సంరక్షణలో పసుపు నీటిని ఎలా చేర్చుకోవాలో, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొటిమలు తొలగిపోతాయి ;

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పసుపును నీటిలో కలిపి తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

READ ALSO : face pack : మచ్చలు, మొటిమలు తొలగించి చర్మాన్ని కాంతి వంతంగా మార్చే పసుపు, శనగ పిండి ఫేస్ ప్యాక్!

వాపు తగ్గించుకునేందుకు ;

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంది, ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు నీరు తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది.

చర్మ వైద్యంగా ;

శతాబ్దాలుగా గాయాలను నయం చేయడానికి పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపును నీటిలో కలిపి తీసుకోవటం వల్ల మొటిమల మచ్చలు, చిన్న కోతలు , చర్మపు చికాకులను నయం చేయవచ్చు.

READ ALSO : Turmeric Side Effects : పసుపు అధిక వినియోగంతో సైడ్ ఎఫెక్ట్స్

చర్మ సంరక్షణలో పసుపును ఎలా చేర్చు కోవాలంటే ;

పావు టీస్పూన్ పసుపును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. అలాగే పసుపు నీటిలో కొన్ని నల్ల మిరియాలు వేసుకోవచ్చు. ఇది పైపెరిన్ కలిగి ఉంటుంది, ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు త్రాగటం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పసుపు కలిపిన నీటిని తీసుకునే ముందు, ఆరోగ్య నిపుణుడిని సంప్రదించటం మంచిది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.