Turmeric Side Effects : పసుపు అధిక వినియోగంతో సైడ్ ఎఫెక్ట్స్

విరేచనాలు, వికారం వంటి లక్షణాలు పసుపు తీసుకోవటం వల్ల కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పసుపులోని కర్కుమిన్ జీర్ణాశయాన్ని చికాకు పెట్టే గుణం కలిగి ఉంటుంది.

Turmeric Side Effects : పసుపు అధిక వినియోగంతో సైడ్ ఎఫెక్ట్స్

Turmeric

Turmeric Side Effects : అన్ని సమస్యలకు హోం రెమెడీగా పసుపును వినియోగిస్తుంటారు. పురాతన కాలం నుండి పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనిలో అనేక ఔషదగుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు స్ఫష్టం చేస్తున్నారు. అయితే పసుపు కొన్నిసార్లు సమస్యగా మారవచ్చు. దీని అధికంగా వినియోగించటం వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి.

1. రక్తస్రావం ; పసుపు తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం నెమ్మదిస్తుంది. ఇది చివరికి రక్తస్రావం రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో గాయాలు, రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. వివిధ రకాల రుగ్మతలకు మెడిసిన్స్ వాడుతున్నవారు పసుపుతీసుకోవటం వాటి సంఘర్షణ వల్ల అధిక రక్తస్రావం కలిగించే అవకాశాలు ఉంటాయి.

2.కడుపులో చికాకు ; పసుపును వండిన కూరలో వినియోగిస్తే ఎలాంటి కడుపు సమస్యలు, ఇతర జీర్ణక్రియ కారణమవుతుందని గుర్తించకపోయినప్పటికీ, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారు పసుపును తీసుకుంటే జీర్ణశయ సమస్యలకు దారితీయవచ్చు.

3.పిత్తాశయం సమస్యలు ; పసుపులో గణనీయమైన మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని పెంచే రసాయనం. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ప్లేసిబోతో పోలిస్తే పసుపు మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలను గణనీయంగా పెంచుతుంది.

4. కిడ్నీ స్టోన్ ; పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పసుపులో ఆక్సలేట్‌లు ఉండటమే దీనికి కారణం. ఆక్సలేట్‌లు కాల్షియంతో బంధించి కరగని కాల్షియం ఆక్సలేట్‌ను ఏర్పరుస్తాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు ప్రధానంగా కారణమవుతుంది. కాబట్టి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే వారు పసుపును ఖచ్ఛితంగా తీసుకోకుండా ఉండటమే మంచిది.

5. అతిసారం మరియు వికారం ; విరేచనాలు, వికారం వంటి లక్షణాలు పసుపు తీసుకోవటం వల్ల కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పసుపులోని కర్కుమిన్ జీర్ణాశయాన్ని చికాకు పెట్టే గుణం కలిగి ఉంటుంది. పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది చర్మానికి హానికలిగిస్తుంది. దురద పెడుతుంది. పొట్ట లైనింగ్ కు హాని కలిగిస్తుంది. దాని వల్ల గ్యాస్టిక్ సమస్య ఎదుర్కోవల్సి వస్తుంది.

6.కాలేయ సమస్య ; లివర్ ఇన్ఫ్లమేషన్ కు గురిఅయ్యే వారు, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడే వారు పసుపును ఖచ్చితంగా నివారించాలి. పసుపులో ఉండే గుణాలు, మరింత కాలేయ సమస్యలను పెంచుతుంది. పసుపు డయాబెటిక్ పేషంట్స్ కు మంచిదని అంటుంటారు. ఎక్కువగా తీసుకోడం వల్ల లో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ కు దారితీస్తుంది.