Ardhachandrasanam : రక్తపోటును నియంత్రించటంతోపాటు, గర్భిణులకు కాన్పు సులభతరం చేసే అర్ధచంద్రాసనం!

రక్తపోటును నియంత్రణలో ఉంచటంలో సహాయపడుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాసప్రక్రియ సజావుగా ఉండేలా సహాయపడుతుంది.

Ardhachandrasanam : రక్తపోటును నియంత్రించటంతోపాటు, గర్భిణులకు కాన్పు సులభతరం చేసే అర్ధచంద్రాసనం!

Along with controlling blood pressure, Ardhachandrasanam makes delivery easier for pregnant women!

Ardhachandrasanam : యోగాసనాలు ఆరోగ్యాన్ని అందించటంతోపాటు, శరీరానికి మంచి వ్యాయామంలా తోడ్పడతాయి. యోగాసనాల్లో ఒక్కొక్కటి ఒక్కోవిధంగా మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాంటి యోగాసనాల్లో అర్ధచంద్రాసనం ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.

రక్తపోటును నియంత్రణలో ఉంచటంలో సహాయపడుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాసప్రక్రియ సజావుగా ఉండేలా సహాయపడుతుంది. ఈ యోగాసనం వల్ల అతిముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే గర్భిణులకు కాన్పును సులభతరం చేస్తుంది. నిత్యం వేయటం వల్ల శరీరం తేలికగా మారుతుంది.

అర్ధచంద్రాసనం వేసే విధానం ;

ముందుగా తాడాసన స్ధితిలో నిలబడాలి. మూడు అడుగుల ఎడం ఉండేలా రెండు కాళ్లనూ దూరంగా జరపాలి. తరువాత రెండు చేతులను భుజాలకు సమాంతరంగా పైకి ఎత్తాలి. అనంతరం కుడి పాదాన్ని బయటకు , ఎడమపాదాన్ని లోపలికి తిప్పాలి. అనంతరం కుడివైపుకు నిదానంగా వంగాలి. కుడిచేతిని నేలపై ఉంచాలి. ఎడమకాలిని సాధ్యమైనంత పైకెత్తాలి. ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. శ్వాసన నిధానంగా ఉండేలా చూసుకోవాలి.

ఈ ఆసన స్ధితిలో పదిహేను సెకన్ల పాటు ఉండాలి. తరువాత తాడాసన స్ధితికి చేరుకోవాలి. తిరిగి ఎడమవైపు కూడా ఇదే విధంగా ఆసనం వేయాలి.