Children : పిల్లలు బరువు తక్కవగా ఉన్నారా?…

రోజులో రెండు మూడు సార్లు కాకుండా అంతకంటే ఎక్కవ సార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకునేలా అలవాటు చేయటం మంచిది.

Children : పిల్లలు బరువు తక్కవగా ఉన్నారా?…

Children (1)

Children : చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లులు తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లల బరువు విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. తక్కవ బరువు ఉండటం, బలహీనంగా ఉండటం వల్ల చిన్నారులు త్వరగా అనారోగ్యాల బారిన పడే చాన్స్ అధికంగా ఉంటుంది.

చిన్నారులు తీసుకునే ఆహారం విషయంలో ముందుగానే ప్రత్యేక మైన చార్ట్ ను రూపొందించుకోవాలి. ప్రతినెల ఎంత ఎత్తు, బరువు ఉన్నాడన్న విషయాన్ని నమోదు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు బరువు, ఎత్తును పరిశీలిస్తూ దానికి తగ్గట్టుగా వారికి అవసరమైన ఆహారాన్ని అందించాలి.

బరువు తక్కువగా ఉన్న పిల్లలకు అధిక కెలోరీలు ఉన్న ఆహారాన్ని అందించాలి. పాలను కలిపి షేక్స్, స్మూథీలు, బంగాళదుంపతో చేసిన వంటకాలను వారికి ఆహారంగా అందించాలి. కొవ్వు పాల ఉత్పత్తుల ద్వారా వారికి కావాల్సిన పోషకాలను అందించవచ్చు. చీజ్, మిల్క్,గుడ్డు, చేప, గింజలు, విత్తనాలు ఆహారంగా తీసుకునేలా చూడాలి. చిన్నారులకు వీటిని తినిపించటం కష్టమైనా వాటిని తినిపించేలా శ్రద్ధ తీసుకోవాలి.

రోజులో రెండు మూడు సార్లు కాకుండా అంతకంటే ఎక్కవ సార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకునేలా అలవాటు చేయటం మంచిది. ఆహారం తినే ముందుగా ద్రవపదార్ధాలైన జ్యూస్ లు, శీతలపానీయాలు, మంచి నీరు అధికమోతాడులో ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల పిల్లల్లో కడుపు నిండిపోయిన బావనతో ఆహారం సరిగా తీసుకోలేరు.

తినమని ఎక్కవ ఒత్తిడి చెయ్యవద్దు. ఇలా చేస్తే అసలు తినటమే మానేసే అవకాశం ఉంటుంది. వైద్యుల సలహామేరకు మల్టీవిటమిన్లు, సప్లిమెంట్లు అందించాలి. ఫోన్లు, టివి లు చూస్తూ తినకుండా కుటుంబసభ్యులంతా కలసి కూర్చుని తినటం వల్ల తిన్న ఆహారం వంటపడుతుంది. అదే క్రమంలో పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయటం వల్ల పిల్లల కండరాలు బలోపేతమౌతాయి. తద్వారా ఆహారం తీసుకోవటం తోపాటు, రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు.