Exercises : అతి వ్యాయామాలు అనర్ధదాయకమా..?

ఆడవారిలో రుతుక్రమంపై అతి వ్యాయామం తీవ్ర ప్రభావంచూపే ప్రమాదముంది. గంటల తరబడి వ్యాయామం చేస్తూ గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదముంది. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తే మహిళ్లలో నెలసరి వచ్చేముందు ప్రొజెస్టెరాన్ స్థాయి పెరిగే అవకాశం ఉంది

Exercises : అతి వ్యాయామాలు అనర్ధదాయకమా..?

Exercise

Exercises : ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం వ్యాయామం చేస్తే మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఎక్సర్‌సైజ్ కేవలం ఫిట్ నెస్ కు మాత్రమే కాదు.. మరెన్నో జబ్బుల నుంచి రక్షించడంలోనూ సహాయపడుతుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలన్నా, మొదడు చురుగ్గా పనిచేయాలన్నా, గుండె జబ్బులను నివారించాలన్నా, మధుమేహం వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవాలన్నా, రక్తపోటు కంట్రోల్లో ఉండాలన్నా, ఇమ్యునిటీ పవర్ పెరగాలన్నా ఖచ్చితంగా ఎక్సర్‌సైజ్ చేయాల్సిందే. శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామాలు చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అతిగా చేస్తే మాత్రం వివిధ రకాల దుష్ప్రభావాలు తప్పవంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అందుకే ఎక్కువ వర్కవుట్స్‌ చేస్తే ఎక్కువ దృఢత్వం సొంతమవుతుందన్న అపోహను పక్కన పెట్టి.. రోజుకో అరగంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే మనం చేసే ఎక్సర్‌సైజ్ అటు ఆరోగ్యాన్ని, ఇటు ఫిట్‌నెస్‌ను అందించాలే తప్ప మన శరీరానికి హానికరం కాకూడదు. అవును! కొందరు త్వరగా బరువు తగ్గేందుకు లేదా ఇతరితర కారణంగా వల్ల గంటలు తరబడి ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. కానీ, అతి ఎప్పుడూ అనర్థమే. ఇది ఎక్సర్‌సైజ్ విషయంలోనూ వర్తిస్తుంది. అతిగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎముకలు పెళుసవడానికి కారణమవుతాయి. వ్యాయామం మోతాదు మించితే కొన్ని సందర్భాల్లో ఎముకలు ధృడత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

అలాగే మితిమీరిన ఎక్సర్‌సైజ్ వల్ల చిన్నవయసులోనే హృద్రోగాల బారిన పడడంతో పాటు, మరణాల ముప్పు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అతిగా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల సంతాన సమస్యలు కూడా తలెత్తుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇక అతిగా ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు శరీరం ఎక్కువ అలసటకు గురై.. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువని అంటున్నారు. అందుకే వారంలో ఐదు లేదా ఆరురోజులు వ్యాయామం చేసి మిగతా సమయంలో ధ్యానం, చిన్న యోగాసనాలు వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆడవారిలో రుతుక్రమంపై అతి వ్యాయామం తీవ్ర ప్రభావంచూపే ప్రమాదముంది. గంటల తరబడి వ్యాయామం చేస్తూ గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదముంది. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తే మహిళ్లలో నెలసరి వచ్చేముందు ప్రొజెస్టెరాన్ స్థాయి పెరిగే అవకాశం ఉంది..దీనివల్ల మహిళలు అసహనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. మహిళలు రోజుకు 90 నిమిషాలకు మించి వర్కౌట్స్ చేస్తే మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం అంటుంటారు పెద్దలు. ఇది ఒక్క ఆహారం విషయంలోనే కాదు..ఫిట్‌నెస్‌ కోసం చేసే వ్యాయామాల విషయంలోనూ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.