Beat Root : ఇన్ ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడే బీట్ రూట్!
బీట్రూట్లను తినడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను సృష్టించి, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. దీనిలోని ఇనుము రక్తహీనతను నివారిస్తుంది.

Beat Root : బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్‌లో ఒకటి. ఇది మొత్తం ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, ఐరన్, ఫోలేట్ అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. బీట్రూట్ రక్తపోటును తగ్గించడానికి, మంటను తగ్గించడానికి, రక్తహీనతను నివారించడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బీట్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ మీ శరీరాన్ని అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, ఇతర ఫ్లూ వంటి లక్షణాలు సర్వసాధారణం. బీట్ రూట్ లో ఉండే ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ వీటిని నిరోధించడంలో సహాయపడుతుంది. వీటికి వ్యతిరేకంగా సమర్థవంతంగా పోరాడుతుంది.
చలికాలంలో తక్కువ తేమ కారణంగా ప్రజలు జలుబు మరియు ఫ్లూ బారిన పడతారు. బీట్రూట్ శీతాకాలపు ఆహారం. ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన పోషకాహారానికి ఒక పవర్‌హౌస్. ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్న బీట్రూట్లను తినడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను సృష్టించి, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. దీనిలోని ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. రోజూవారీ ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును నివారించడంలోనూ బీట్రూట్ సాయపడుతుంది. రక్తాన్ని బాగా శుద్ధిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియ సక్రమంగా జరగడంలోనూ బీట్రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మీరు అనేక విధాలుగా మీ ఆహారంలో బీట్రూట్ను జోడించవచ్చు. సలాడ్లు, స్మూతీస్, సూప్ వంటివాటిల్లో తాజా బీట్రూట్లను ఎంచుకోవచ్చు. ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్రూట్ స్మూతీ, బీట్రూట్ సలాడ్‌తో ఆరోగ్యానికి దోహదపడుతుంది. బీట్రూట్లోని నైట్రేట్ రక్తప్రసరణ వేగాన్ని పెంచి రక్తనాళాల్లో గడ్డలను నివారిస్తుంది. బీట్రూట్లో పుష్కలంగా లభించే విటమిన్-బి చర్మం, గోళ్లు, వెంట్రుకల పోషణలో సాయపడుతుంది.
1Miss India : ఫెమినా మిస్ ఇండియా 2022 సినీ శెట్టి
2Puri Jagannath: ఉచిత తీర్థయాత్ర స్కీంలోకి పూరి జగన్నాథ్ యాత్ర
3Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొరత.. శ్రీలంకలో ఇప్పటికీ తెరుచుకోని పాఠశాలలు
4NBK 107 : బాలకృష్ణతో అల్లరి చేస్తున్న నరేష్..
5Miss India 2022: కర్ణాటకకు చెందిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022
6Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..
7Nani : ‘అంటే సుందరానికి’ వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి..
8IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న భారత్.. 250 దాటిన ఆధిక్యం
9Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్లెంట్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్
10Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం