Gut Health : అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం పేగుల ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాయా? పేగుల ఆరోగ్యం కోసం ఇలా చేసి చూడండి!

ఒక్కోసారి పేగుల్లోని బొబ్బలు పగిలి మలంలో రక్తం కూడా వస్తుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే అతిగా తినకూడదు. సీజనల్‌ ఫ్రూట్స్‌ తింటుండాలి. నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇష్టమొచ్చిన సమయంలో భోజనం చేస్తే కడుపులో మంట, గ్యాస్‌ కచ్చితంగా వస్తుంది. ఏ ఆహరం తిన్నా నమిలి మింగి తినాలి.

Gut Health : అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం పేగుల ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాయా? పేగుల ఆరోగ్యం కోసం ఇలా చేసి చూడండి!

Gut Health : పేగులు చేసే పని మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం. శరీరంలోని మిగిలిన చెడు పదార్థాలను తొలగించటం. పేగులు మన మొత్తం శరీరానికి పోషకాలను చేరవేస్తాయి. అవి సరిగ్గా పనిచేయాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి. మన జీర్ణక్రియలో చిన్న పేగు, పెద్ద పేగు రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేగులో ఏదైనా సమస్య తలెత్తితే ముందుగా మన జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. పేగులకు నష్టం జరిగితే, శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి.

అతిసారం, మలబద్ధకం, పిత్త సమస్యలు ఉన్న జాగ్రత్తలు పాటించాలి. బలహీనమైన జీర్ణవ్యవస్థ కారణంగా రోగనిరోధక శక్తి బలహీనంగా తయారవుతుంది. పేగులు అనారోగ్యకరంగా ఉన్నప్పుడు అజీర్ణం, గుండెల్లో మంటగా అనిపించడం, విరేచనాలు అవ్వడం,చర్మపు చికాకులు, అధిక దాహం అనిపించడం, జ్వరంగా ఉండటం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, చర్మం పొడిబారడం, శరీర నొప్పులు వంటివి ఉంటాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం పేగుల ఆరోగ్యం బలహీనపడడానికి కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఎన్నో అంశాలు పేగుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.

ఒక్కోసారి పేగుల్లోని బొబ్బలు పగిలి మలంలో రక్తం కూడా వస్తుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే అతిగా తినకూడదు. సీజనల్‌ ఫ్రూట్స్‌ తింటుండాలి. నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇష్టమొచ్చిన సమయంలో భోజనం చేస్తే కడుపులో మంట, గ్యాస్‌ కచ్చితంగా వస్తుంది. ఏ ఆహరం తిన్నా నమిలి మింగి తినాలి. ఉదయం నిద్రలేస్తూనే వీలైనన్ని మంచి నీళ్లు తాగాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్ది సమయం వాకింగ్ చేయటం అలవాటుగా మార్చుకోవాలి. వేపుళ్లు, మసాలాలు తగ్గిస్తే పొట్టకు మంచిది. పెద్ద పేగుల్లో మలం బయటకి పోనప్పుడు మలబద్ధకం వస్తుంది. ఈ సమస్య ఒత్తిడి, ఆహారం అలవాట్లు, హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల కలుగుతుంది.

నిద్రలేమి శరీరాన్నే కాదు పేగులను కూడా సమస్యల్లోకి నెట్టేస్తుంది. సరేగా నిద్రపోకపోతే శరీరం అధిక ఒత్తిడికి గురవుతుంది. అది గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరానికి సరిపడని ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, పొత్తి కడుపు నొప్పి, అజీర్ణం, ఎసిడిటీ, పుల్లని తేపులు వచ్చి కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. అందుకే గట్ ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు గట్ లో అభివృద్ధి చెందే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాని వల్ల పేగులు ప్రమాదంలో పడిపోతాయి.

పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ;

మద్యం సేవించడం ఆరోగ్యానికి అన్నీ విధాలుగా హాని చేస్తుంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట లోపలి పొర దెబ్బతింటుంది. ఇది చివరకి పొట్ట సమస్యలకి దారి తీస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అది కడుపుపై ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కడుపు సమస్యలకి దూరంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. జీలకర్ర, యాలకులు, త్రిఫల చూర్ణం తరచూ తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యగా ఉంటాయి. ఆహారాన్ని నమిలి మింగాలి లేదంటే అది జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో మంచి బాక్టీరియా, చెడు బాక్టీరియా ఉంటాయి. మంచి బాక్టీరియా మ‌నకు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. క‌నుక ఆ బాక్టీరియా ఎక్కువ‌గా వృద్ధి చెందాలంటే ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో చెడు బాక్టీరియా న‌శిస్తుంది. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, మజ్జిగ, పనీర్, ప‌చ్చి బఠానీలను ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.