Mushrooms : పుట్టగొడుగులతో క్యాన్సర్, పక్షవాతానికి చెక్

పుట్టగొడుగుల్లో ఉండే బ‌యోయాక్టివ్స్‌, బీటా గ్లూకాన్‌లతో పాటు వీటి ఔష‌ధ గుణాలు శ‌రీరం కోలుకునే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డం, ఫ్లూ ఇన్ఫెక్ష‌న్ల ముప్పును త‌గ్గించ‌డం చేస్తాయి. వీటిలో అధిక ఫైబ‌ర్‌, ప్రిబ‌యోటిక్స్ వ‌ల్ల

Mushrooms : పుట్టగొడుగులతో క్యాన్సర్, పక్షవాతానికి చెక్

Mushrooms

Mushrooms : పుట్ట‌గొడుగుల‌ పేరు చెబితే ఆహార ప్రియుల నోరూరిపోతుంది. మాంసాంహారం తినని వారు సైతం పుట్టగొడుగులను ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. పుట్టగొడుగుల తినటం ద్వారా శరీరానికి చేకూరే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఎన్నో పోషకాలు దాగున్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

పుట్ట‌గొడుగులను ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో ఇర్గోధియోనైన్, సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో డిఎన్ఎ ను దెబ్బతీస్తూ, గుండె జబ్బులు, కాన్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను ఇవి ఎదుర్కొంటాయి. పుట్ట‌గొడుగుల్లో ఉండే విటమిన్ బీ12, యాంటీఆక్సిడెంట్లతో కుంగుబాటు స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు.

చాలా మంది వివిధ రకాల సమస్యలతో డిప్రెష‌న్‌ కు లోనవుతుంటారు. అలాంటి వారు డిప్రెషన్ నుండి బయటపడేందుకు పుట్టగొడుగులు సూప‌ర్ ఫుడ్‌ గా ఉపయోగపడుతుంది. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా మెరుగైన రోగ నిరోధ‌క వ్య‌వ‌స్ధ‌ను పెంపొందించుకోవ‌చ్చు. కోవిడ్ వ్యాప్తినేధ్యంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పుట్ట‌గొడుగుల‌ను తీసుకోవ‌డం శ‌రీరానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

పుట్టగొడుగుల్లో ఉండే బ‌యోయాక్టివ్స్‌, బీటా గ్లూకాన్‌లతో పాటు వీటి ఔష‌ధ గుణాలు శ‌రీరం కోలుకునే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డం, ఫ్లూ ఇన్ఫెక్ష‌న్ల ముప్పును త‌గ్గించ‌డం చేస్తాయి. వీటిలో అధిక ఫైబ‌ర్‌, ప్రిబ‌యోటిక్స్ వ‌ల్ల పుట్ట‌గొడుగులు శ‌రీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాల మ‌ధ్య స‌రైన బ్యాలెన్స్ ఉండేలా దోహ‌ద‌ప‌డ‌టంతో జీర్ణ‌క్రియ స‌జావుగా సాగుతుంది. శరీరానికి అవసరమయ్యే విట‌మిన్ డీ పుట్ట‌గొడుగుల్లో ప‌ది నుంచి యాభై శాతం వ‌ర‌కూ ల‌భిస్తుంద‌ని ఇటీవల ఆస్ట్రేలియాలో చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

పుట్టగొడుగుల్లో 90శాతం నీరే ఉంటుంది. పోటాషియం లభిస్తుంది. సోడియం ఉండదు. కొవ్వ పదార్ధాలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదు సార్లు పుట్టగొడుగులు తింటే రక్తపోటు తగ్గటంతోపాటు, పక్షవాతం ముప్పును అరికట్టవచ్చు.