City Scan Dangerous : కరోనా టెస్టు చేయిస్తున్నారా? సిటీ స్కాన్‌తో జాగ్రత్త..!

కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణతో జనం వణికిపోతున్నారు. కొద్దిపాటి లక్షణాలకే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కోవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చినా సరే.. నమ్మకం కుదరక సిటీ స్కాన్లను ఆశ్రయిస్తున్నారు.

City Scan Dangerous : కరోనా టెస్టు చేయిస్తున్నారా? సిటీ స్కాన్‌తో జాగ్రత్త..!

City Scan Very Dangerous More Than Covid Virus (1)

City Scan Dangerous : కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణతో జనం వణికిపోతున్నారు. కొద్దిపాటి లక్షణాలకే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కోవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చినా సరే.. నమ్మకం కుదరక సిటీ స్కాన్లను ఆశ్రయిస్తున్నారు. కరోనా ఉందో లేదో తేలితే చాలన్న భయంతో అడ్డగోలుగా సిటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. కానీ.. సిటీ స్కాన్‌తో కరోనా కంటే పెద్ద ముప్పు పొంచి వుందన్న విషయాన్ని తెల్సుకోలేకపోతున్నారు. అందుకే.. సిటీ స్కాన్‌పై దేశ ప్రజల్ని అలర్ట్‌ చేశారు ఎయిమ్స్‌ డైరెక్టర్ రణ్‌దీప్‌ గులేరియా. ఇష్టమొచ్చినట్లు సిటీ స్కాన్‌ చేయించుకుంటే క్యాన్సర్‌ ముప్పు తప్పదని హెచ్చరించారు.

తేలికపాటి లక్షణాలు ఉన్నప్పుడు సిటీ స్కాన్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు ఎయిమ్స్ చీఫ్ గులేరియా. అంతేకాదు.. ఒక్క సిటీ స్కాన్ 300 చెస్ట్‌ ఎక్స్‌రేలతో
సమానమని… ఇది చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. ఎక్కువసార్లు సిటీ స్కాన్‌ చేయించుకుంటే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందన్నారు గులేరియా. ముఖ్యంగా
యువతలో ఈ ముప్పు మరింత ఎక్కువన్నారు.

సిటీ స్కాన్‌లో కనిపించే కొన్ని ప్యాచ్‌లు ఎలాంటి చికిత్స లేకుండానే మాయమైపోతాయన్నారు ఎయిమ్స్‌ చీఫ్‌. లక్షణాల్లేని చాలామందిలో సిటీ స్కాన్ చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్ వస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. కాబట్టి ఏదైనా అనుమానం ఉంటే తొలుత చెస్ట్‌ ఎక్స్‌రే తీయించుకోవాలని… తప్పనిసరి పరిస్థితుల్లో సిటీ స్కాన్‌కు వెళ్లాలా? వద్దా? అనే దానిపై డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచించారు గులేరియా.