Coconut Sugar : షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే కొబ్బరి చక్కెర

కొబ్బరి చక్కెర వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి చక్కరను కోకో సాప్ షుగర్ అని బ్లోసమ్ షుగర్ అని పిలుస్తారు.

Coconut Sugar : షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే కొబ్బరి చక్కెర

Coconut Sugar

Coconut Sugar : చక్కెరను ఎక్కువగా తింటే అనేక అనారోగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా మరోవైపు రోజురోజుకు షుగర్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది చక్కెర కు బదులు ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేస్తున్నారు. తీపికోసం తేనె, బెల్లం, తాటి బెల్లం వంటి వాటిని వినియోగిస్తున్నారు. వీటిలో ఎలాంటి రసాయనాలు కలపకపోవటంతో వాటిని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు.

అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు సైతం తినేందుకు వీలున్న మరో చక్కెర ప్రస్తుతం అందుబాటులో ఉంది. అదే కొబ్బరి చక్కెర…ఈ విషయం చాలా మందికి తెలియదు. తీపి కోసం చక్కెరకు బదులుగా కొబ్బరి చక్కెర ను వాడుకోమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బరి చక్కెర వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి చక్కరను కోకో సాప్ షుగర్ అని బ్లోసమ్ షుగర్ అని పిలుస్తారు. కొబ్బరికాండం నుంచి తీసిన ద్రవంతో ఎలాంటి రసాయనాలు కలపకుండా చ‌క్కెర‌ను త‌యారు చేస్తారు. సాధారణ చక్కెరలో గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది. అయితే కొబ్బరి చక్కెరలో ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ ఉంటాయి. కొబ్బరి చక్కెరలో ఐరన్, జింక్, పొటాషియం, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు , ఫైబర్ అధికంగా ఉంటాయి.

కొబ్బరి చక్కెరను అధికంగా తిన్నా క్యాల‌రీలు పెరగవు. జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ప్రీబయోటిక్స్ జీర్ణక్రియను వేగవంతం చేయటంలో తోడ్పడతాయి. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారించటంతోపాటు శరీరంలో మెట‌బాలిజం క్రమబద్ధీకరిస్తుంది. కొబ్బరి చ‌క్కెర‌లో ఉండే విట‌మిన్ సి, నైట్రోజ‌న్ గుండెను ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరి చక్కెర తినడంవలన ఎముకలు బలపడతాయి. ఈ షుగర్‌ను కాఫీ నుంచి టీ వరకు అన్నింటిలోనూ ఉపయోగించవచ్చు.

కరగడానికి సాధారణ చక్కెర కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు సైతం ఈ చ‌క్కెర‌ను వినియోగించవచ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ లో ఉంచేందుకు కొబ్బరి చక్కెర సహాయపడుతుంది.