Coriander Water : వ్యాధుల నుండి రక్షణ కల్పించే ధనియాల కషాయం
చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను పోగొట్టటంలో సైతం ధనియాల కషాయం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని మృధువుగా, కాంతి వంతంగా మారుస్తాయి.

Coriander Water
Coriander Water : ప్రతి ఒక్కరి వంటింటల్లో ధనియాలు తప్పకుండా ఉంటాయి. పురాతన కాలం నుండి మానవశరీరంలో అనేక సమస్యలను తొలగించటంలో ధనియాలు ప్రముఖ పాత్రనే పోషిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే ఈ ధనియాలతో తయారు చేసుకునే కషాయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు కొద్ది మొత్తంలో ఈ కషాయాన్ని సేవించటం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
కడుపులో ఎసిడిటీ, మంట వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించటంలో ధనియాల కషాయం తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ధనియాల్లో ఎన్నో పోషకవిలువలు, ఆరోగ్యకరమైన ఫైబర్ వల్ల శరీరంలో మెటబాలిజం మెరుగుపడుతుంది. ప్రతిరోజు 40 ఎం.ఎల్ ధనియాల కషాయం తీసుకోవటం వల్ల ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలో పేరుకు పోయే టాక్సిన్స్ ను తొలగించటంలో సైతం ఇది బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్ని దీన్ని తాగటం వల్ల రోజంతా యాక్టీవ్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
ధనియాల కషాయం తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తగ్గించటంలో సహాయపడతాయి. జట్టు బలంగా, వేగంగా పెరగటానికి ధనియాల్లో ఉండే విటమిన్ కె,సి,ఎలు దోహదం చేస్తాయి. జట్టు రాలటం, చిట్లటం వంటి సమస్యలు దూరమౌతాయి. జీర్ణక్రియను మెరుగుపర్చటంలో ధనియాల కషాయాన్ని మించింది లేదు. అంతేకాకుండా అధిక బరువుతో బాధపడుతున్న వారో 6వారాల పాటు ధనియాల కషాయాన్ని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను పోగొట్టటంలో సైతం ధనియాల కషాయం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని మృధువుగా, కాంతి వంతంగా మారుస్తాయి. శరీరంలో అధిక కొవ్వులను కరిగించేందుకు , కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది. మధుమేహం అదుపులో ఉంచేందుకు ఈ కషాయాన్ని సేవించవచ్చు.
ధనియాల కషాయాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఆతరువాత ఆ నీటిని పొయ్యిమీద పెట్టి బాగా మరిగించాలి. అనంతరం చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టుకుని తాగాలి. మిగిలిపోయిన ధనియాల పిప్పిని ఎండబెట్టి పొడిగా మార్చుకుని వంటల్లో తిరిగి వినియోగించుకోవచ్చు.