Cough : దగ్గుకు గుండె జబ్బుకు లింకుందా!

ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. అలా కాకుండా గుండెకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు నెలల పాటు అలా కొనసాగతుంటుంది. చివరకు సీరియస్ గా మారుతుంది.

Cough : దగ్గుకు గుండె జబ్బుకు లింకుందా!

Cough

Cough : ఇటీవలి కాలంలో గుండె జబ్బు సమస్యలు అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్నాయి. అనేక మంది అకస్మిక గుండె వైఫల్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె జబ్బులు రావటానికి ముందుగా కొన్ని రకాల సంకేతాలు ముందస్తుగా శరీరంలో బయటపడతాయి. అలాంటి వాటిలో దగ్గు కూడా ఒకటి. ఎడతెరపి లేకుండా రోజుల తరబడి దగ్గు వస్తుంటే అనుమానించాల్సిన అవసరం ఉంది. దగ్గు కారణంగా విపరీమైన అలసట, పక్కటెముకల్లో నొప్పితో బాధపడాల్సి వస్తుంది.

ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. అలా కాకుండా గుండెకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు నెలల పాటు అలా కొనసాగతుంటుంది. చివరకు సీరియస్ గా మారుతుంది. దీనినే ఎండోకార్టైటిస్ అంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారికి ఈ వ్యాధి రావటం అరుదుగానే ఉంటుంది. దగ్గుతోపాటు ఆయాసం రావటం, వ్యాయామం చేస్తున్న సమయంలో , పడుకున్నప్పుడు ఆయాసం , పిల్లికూతలు , ఛాతిలో బరువుగా ఉండటం, పొడిదగ్గు, దగ్గులో కళ్లె వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వీటితోపాటు కాళ్లలో వాపు, బరువు పెరగటం , కడుపు ఉబ్బరం, శ్వాస సరిగా తీసుకోలేక పోవటం వంటి సమస్యలు ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది. కొన్ని సందర్భాల్లో నిస్సత్తువ, వికారం, కడుపు నిండుగా అనిపించటం వంటి లక్షణాలు గుండె వైఫల్యాలకు దారి తేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో సమస్యను తెలుసుకునేందుకు రక్త పరీక్ష, ఛాతీ ఎక్స్ రే, ఎకోకార్డియోగ్రామ్, ట్రెడ్ మిల్ టెస్ట్ వంటి పరీక్షల ద్వారా సమస్యను గుర్తించవచ్చు. జబ్బు తీవ్రతను బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు.

జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, గుండె ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవటం ద్వారా ఇలాంటి సమ్యల నుండి బయటపడవచ్చు. గుండెకు మేలు చేసే కూరగాయలు, పండ్లు, బాదం, గింజలు, తృణధాన్యాలు, చేపలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అధిక బరువును నియంత్రించుకోవటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. దగ్గు సాధారణమైనప్పటికీ ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చికిత్స పొందితే తొలినాళ్లల్లోనే దాని నుండి ఉపశమనం పొందవచ్చు.