Medipally Murder Case: 3 చున్నీలు బిగించి భర్త హత్య.. మేడిపల్లి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

పోస్టుమార్టం రిపోర్టులో ఆయన ఒంటి మీద గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Medipally Murder Case: 3 చున్నీలు బిగించి భర్త హత్య.. మేడిపల్లి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

Updated On : December 22, 2025 / 8:37 PM IST

Medipally Murder Case: హైదరాబాద్ మేడిపల్లి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసులో భార్యే హంతకురాలు అని పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధంతో భార్యే భర్తను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ప్రియుడు మహేశ్ తో కలిసి భర్త అశోక్ పై భార్యే దాడి చేయించింది. మూడు చున్నీలు మెడకు బిగించి హత్య చేసినట్లు భార్య పూర్ణిమ పోలీసుల ముందు ఒప్పుకుంది. పూర్ణిమ ఇంటి పక్కనే మహేశ్ అనే యువకుడు అద్దెకు ఉండే వాడు. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె.. భర్త ఆకాశ్ తో తరుచూ గొడవలు పడుతుండేది. భర్తకు విషయం తెలిసి చాలాసార్లు దండించాడు కూడా. పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. కానీ, ఆమె మారలేదని పోలీసుల విచారణలో తెలిసింది. మహేశ్ తో కలిసి అశోక్ ను అంతమొందించే ప్లాన్ చేసింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశోక్ తో గొడవ పెట్టుకున్న పూర్ణిమ.. ప్రియుడు మహేశ్ సాయంతో చున్నీలతో మెడకు బిగించి ఊపిరి తీసింది. హాల్ లో హత్య చేశాక ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో బెడ్ రూమ్ కి మృతదేహాన్ని తీసుకెళ్లింది. హార్ట్ ఎటాక్ తో అశోక్ మరణించాడని ఆయన కుటుంబసభ్యులకు విషయాన్ని చేరవేసింది.

అయితే, పోస్టుమార్టం రిపోర్టులో ఆయన ఒంటి మీద గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. 10 రోజుల వరకు అనుమానం రాకుండా చూసుకున్న భార్య పూర్ణిమ.. అసలు విషయం పోస్టుమార్టం రిపోర్టులో వచ్చాక పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి భర్త అశోక్ ను మర్డర్ చేసినట్లు అంగీకరించింది.

Also Read: తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి