Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా వేరియంట్ల కంటే ఈ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది.

Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

Covid 19 Omicron Symptoms As Skin Rash The New Key Symptom Of Coronavirus Variant, According To Scientists

Omicron Symptoms : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన కరోనా వేరియంట్ల కంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతోంది. వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి అనేదానిపై స్పష్టత లేదు. గత వేరియంట్ల లక్షణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తరహా లక్షణాలు ఉంటాయని ప్రకటించలేదు. కానీ, ఒమిక్రాన్ లక్షణాలపై లండన్‌ కింగ్స్‌ కాలేజీ, హెల్త్‌ సైన్స్‌ కంపెనీ ZOE సంయుక్తంగా పరిశోధన నిర్వహించింది.

ఒమిక్రాన్‌ లక్షణాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఒమిక్రాన్ కొన్ని లక్షణాలను నిర్ధారించింది.. ఒమిక్రాన్ సోకిన వారిలో చర్మంపై అసాధారణ స్థాయిలో దద్దుర్లు, దురదలు వస్తుంటాయని కనుగొంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది ఒమిక్రాన్ లక్షణం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఒమిక్రాన్ సోకిందా లేదా తెలియాలంటే చర్మంలో మార్పులను గమనించాలని లండన్‌ కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు సూచిస్తున్నారు. ZOE COVID Study యాప్‌ ద్వారా 3.36 లక్షల మంది బాధితుల డేటాపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు వస్తున్నట్టు గుర్తించారు.

కొవిడ్ పరీక్ష చేయించుకున్న 8.2 శాతం మందిలో కరోనా సాధారణ లక్షణాలు.. చర్మంపై దద్దుర్లు కనిపించాయి. సాధారణ ఇన్ఫెక్షన్ దద్దుర్లు లేదా ఒమిక్రాన్ లక్షణాలో చెక్ చేసేందుకు సైంటిస్టులు ఆన్‌లైన్ సర్వేను నిర్వహించారు. కరోనా సోకిన 12 వేల మంది చర్మంపై ఇలాంటి దద్దుర్లు కనిపించాయి. 17 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు మొదటగా గుర్తించారు. ప్రతి ఐదుగురిలో ఒకరి చర్మంపై దద్దుర్లు కనిపించాయని గుర్తించారు. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్లలో ఒక లక్షణంగా పరిశోధకులు గుర్తించారు. ZOE యాప్‌ నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 2,500 కేసుల ఆధారంగా ప్రాథమిక డేటాను పరిశీలించగా.. డెల్టా కంటే Omicron మరింత తేలికపాటిదని తేలింది. కానీ, ఈ వేరియంట్ అత్యంత వేగంగా సోకుతుందని నిర్ధారించారు.

సాధారణంగా ప్రతి సీజన్ లోనూ చర్మంపై అనేక రకాల ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. మోచేతులు, మోకాలు, చేతులు, పాదాల వెనుక భాగంలో కనిపిస్తుంటాయి. ఇతర దద్దుర్లు మురికి వేడితో వస్తుంటాయి. మీ శరీరం అంతటా కనిపిస్తాయి. కొన్నిరోజులుకు అవే మానిపోతాయి. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు ఇంట్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ జలుబు లక్షణాలు లేకుండా చూసుకోండి. ఏమైనా లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోవడం ఉత్తమని సూచిస్తున్నారు. రెండు డోసుల టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : Maharashtra : ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా.. అసెంబ్లీలో 50 దాటిన పాజిటివ్ కేసులు