సీతాఫలం ఈ సీజన్‌లోనే ఎందుకు తినాలంటే..

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 06:22 AM IST
సీతాఫలం ఈ సీజన్‌లోనే ఎందుకు తినాలంటే..

శీతాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు సీతాఫలం. ఈ సీజ‌న్‌ లో మ‌న‌కు సీతాఫ‌లం ఎక్కువ‌గా దొరుకుతుంది. ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తినాల్సిందే. ఎందుకంటే ఇందులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి.

అంతేకాదు సీతాఫలం తిన‌డం వ‌ల్ల మన శరీరానికి విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో లభిస్తాయి.

సీతాఫలంతో పాటు దాని చెట్టు ఆకు, బెరడు, గింజలలో కూడా మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలున్నాయి. యాపిల్ పండ్లతో పోల్చిస్తే.. సీతాఫలం తక్కువ ధరకు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ సీజన్లో తప్పక సీతాఫలం తిని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.

సీతాఫలం వల్ల కలిగే లాభాలు: 

> సీతాఫ‌లాన్ని ఉద‌యాన్నే పరిగడుపున తీసుకుంటే కండ‌రాలు, న‌రాల బ‌ల‌హీన‌త‌లు పోయి శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది.
> విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
> శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తింటే వెంట‌నే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
> ఇందులో  పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.