Plant Based Foods : ఎలాంటి మొక్కల ఆధారిత ఆహారం గుండెకు మేలు చేస్తుందో తెలుసా?

డార్క్ చాక్లెట్లు,  కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది.

Plant Based Foods : ఎలాంటి మొక్కల ఆధారిత ఆహారం గుండెకు మేలు చేస్తుందో తెలుసా?

Plant Based Foods :

Plant Based Foods : గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన ఆహారం మీ రోజువారి డైట్ చార్ట్ లో ఉండేలా చూసుకోవటం చాలా అవసరం. ఈతరహా ఆహారంలో కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలతోపాటు, మాంసంలకు ప్రత్యామ్నాయాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి మీ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కార్డియాక్ డైట్ గా పిలుస్తారు. అంటే సమతుల్య ఆహారం అని అర్ధం. పండ్లు, కూరగాయలు, సన్నని పౌల్ట్రీ మరియు చేపలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు పుష్కలంగా తీసుకోవడం.

విటమిన్ C, విటమిన్ E, సెలీనియం మరియు బీటా కెరోటిన్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని కార్డియాక్ డైట్ లో చేర్చుకోవాలి. ఆకుకూరలు మరియు నారింజ మరియు బొప్పాయి వంటి పండ్లు ఏ భోజనంలో అయిన తీసుకోవచ్చు . విటమిన్ C మరియు E, పొటాషియం, ఫోలేట్, కాల్షియం, బీటా కెరోటిన్ మరియు ఫైబర్ అందించే సరైన కూరగాయలను ఎంచుకోవాలి.

ఓట్ మీల్ తీసుకోవటం ఉత్తమమైన ఆహారం. ఇందులో పీచు పదార్థం ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా గుండెకు మేలు కలుగుతుంది. కిడ్నీ బీన్స్ మరియు బ్లాక్ బీన్స్ వంటి బీన్స్ మరియు బీన్స్ మరియు కాయకురాలలో ఫైబర్, B-విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యకరమైన ఆహారం కోసం తాజా కూరగాయలతో చేసిన ఆహారాన్ని తీసుకోండి .

డార్క్ చాక్లెట్లు,  కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది.

బాదం మరియు వాల్ నట్స్ వంటి ఆరోగ్యకరమైన గింజలు మీ గుండెకు సహాయపడతాయి.అలాగే విటమిన్ ‘సి’ ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. సోయా పాలు, సోయా జున్ను తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తుంది. బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదం కలిగించవు. పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది