warm water : స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే రక్తపోటు తగ్గుతుందా?

డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా వేడినీళ్లు రక్షిస్తాయి.

warm water : స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే రక్తపోటు తగ్గుతుందా?

warm water :

Updated On : October 22, 2022 / 4:39 PM IST

warm water : ప్రతి రోజూ గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.ఇది గొంతు గరగరను పోగొడుతుంది.గోరువెచ్చని నీరు శరీరం నుండి టాక్సిన్స్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించినట్లయితే జీర్ణ ప్రక్రియ బాగా ఉంటుంది.

స్నానం చేసే ముందు ఒక గ్లాసు వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగాలి. నీరు శరీరంలోని రక్తపోటు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చని నీరు తాగడం వల్ల మీ శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది. దీని ఫలితంగా రక్త నాళాలు విస్తరిస్తాయి. వాటి ద్వారా మరింత రక్తం ప్రవహిస్తుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. ఇది చర్మం యొక్క ఉపరితలంపైన, రక్తప్రసరణ వ్యవస్థ విస్తరణకు దారితీస్తుంది.

డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా వేడినీళ్లు రక్షిస్తాయి. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను సైతం వేడి నీళ్లతో అధిగమించవచ్చు. వేడి నీరు గొంతు సమస్యలను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత, కాలకృత్యాల కంటే ముందుగానే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగేయాలి. నీటిని ఒక్కసారిగా గొంతులో వేసుకోని మింగేయకుండా నోటిలోనే ఉంచుకుంటూ నెమ్మదిగా గుటకలు వేస్తూ మింగండి. ఇలా రోజూ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.