Dry Fruits : డ్రై ఫ్రూట్స్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలే!

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ షుగర్స్, క్యాలరీ లు కూడా ఎక్కువగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రొటీన్, రిబోఫ్లావిన్, విటమిన్ A,C,E,K,B6 ,జింక్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

Dry Fruits : డ్రై ఫ్రూట్స్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలే!

Dry Fruits (1)

Dry Fruits : పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లను సమృద్ధిగా కలిగి ఉన్న డ్రై ఫ్రూట్స్ ను సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. కొన్ని రకాల జబ్బులు, వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిచటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. రక్తపోటు, చక్కెర లేదా కొలెస్ట్రాల్ వంటి వాటిని తగ్గిస్తాయి. బెర్రీలు,గింజలు వంటి డ్రై ఫ్రూట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వృద్ధాప్యాన్ని నిరోధించడం, తెలివిని పెంపొందించటంతో పాటుగా మరెన్నో ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్‌ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవటం మేలు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని మోతాదుకు మించి తీసుకోకూడదు.

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ షుగర్స్, క్యాలరీ లు కూడా ఎక్కువగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రొటీన్, రిబోఫ్లావిన్, విటమిన్ A,C,E,K,B6 ,జింక్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలు, నరాలు, దంతాలు ,చర్మానికి ఉపయోగపడతాయి. రక్తహీనత, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడతాయి. వీటిని రోజువారిగా 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. డ్రై ఫ్రూట్స్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఖర్జూరం ; ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. అలాగే ఫ్రాక్టోజ్‌ ఇందులో అధికంగా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది.

బాదం ; పప్పులో మోనో శ్యాచురేటెడ్‌ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బాదం మొతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి. శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది. జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి.

పిస్తా ; పిస్తాలో ప్రొటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలను బలంగా మారుస్తుంది. పిస్తా పప్పు తినటం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గించుకోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. కంటికి వీటిలో ఉండే ఎ,ఇ విటమిన్లు మేలు చేస్తాయి. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

వాల్‌ నట్స్‌ ; వీటిలో విటమిన్ ఇ మరియు ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది. వాల్‌ నట్స్‌ పైన ఉండే పెంకు తీయగానే..పప్పు అంత రుచిగా ఉండకపోయినా 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్‌ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్‌ దీనిలోనే లభిస్తాయి.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది.వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.

ఎండుద్రాక్ష ; ఎండుద్రాక్ష తియ్యగా పుల్లపుల్లగా ఉంటుంది. వీటిలో విటమిన్‌ బి, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తియ తియ్యగా పుల్లపుల్లగా ఉండే ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. తక్కువ గ్లూసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యకరమైనవి.

జీడిపప్పు ; జీడిపప్పులో మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింకు, సెలెనియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజుకు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే పోషకాల లోపంతో వచ్చే వ్యాధులను నివారించవచ్చు. హాని చేసే చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతాయి. గుండెకు మేలు చేస్తాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని అధ్యయనాలు చెబుతున్నాయి.