Preventing Cancer : క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటంలో ఈ ఆహారాలను మించినవి లేవంటున్న నిపుణులు !

క్యారెట్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే తరచూ క్యారెట్లను తినాల్సి ఉంటుంది. రోజువారిగా వీటిని తీసుకున్నా శరీర ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది.

Preventing Cancer : క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటంలో ఈ ఆహారాలను మించినవి లేవంటున్న నిపుణులు !

Experts say that there is nothing more than these foods in preventing cancer!

Preventing Cancer : క్యాన్స‌ర్ ఓ భయంక‌ర‌మైన మ‌హ‌మ్మారి. ఒక్క క‌ణ‌జాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. క్యాన్సర్ అనేది శరీరంలో వివిధ అవయవాల్లో వస్తుంది. వీటిలో బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. వ్యాధి సోకింది మొద‌లు చికిత్స పూర్త‌య్యే వ‌ర‌కు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాల్సి ఉంటుంది.

ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్‌గా ఏర్పడతాయి. వీటినే మనం క్యాన్సర్ గడ్డలుగా పిలుస్తారు. క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. అదే సమయంలో క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు పలు రకాల ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !

ఆకు కూరలు ; ఆకుకూరలు అనేక వ్యాధులతో పోరాడేందుకు , శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు సహాయపడతాయి. అదే క్రమంలో ఇవి క్యాన్సర్‌ను నివారించేందుకు తోడ్పడతాయి. పాలకూర, తోటకూర వంటివి క్యాన్సర్‌పై పోరాడుతాయి. వీటిల్లో ఫైబర్‌, బీటా కెరోటీన్‌, లుటీన్‌, ఫోలేట్‌, కెరోటినాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి.

క్యారెట్ ; క్యారెట్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే తరచూ క్యారెట్లను తినాల్సి ఉంటుంది. రోజువారిగా వీటిని తీసుకున్నా శరీర ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది.

బ్రోకలీ ; క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటంలో బ్రోకలీ బాగ ఉపయోగపడుతుంది. వీటిల్లో ఐసోథియోసైనేట్‌, ఇండోల్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఈ విషయం అనేక అధ్యయనాల్లో తేలింది.

READ ALSO : ఈ ఫుడ్‌తో క్యాన్సర్ ముప్పు..!

గ్రీన్ టీ ; గ్రీన్‌ టీలో క్యాన్సర్‌ నిరోధక గుణాలు ఉంటాయి. బ్లాక్‌ టీ కన్నా గ్రీన్‌ టీలోనే ఎక్కువగా కాటెచిన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి. గ్రీన్ బరువు తగ్గించటంలో , అనవసరపు కొలెస్ట్రాల్ ను తొలగించటంలో సహాయపడుతుంది.

టమాటో ; టమాటో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల టమాటాలను తరచూ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. వీటిల్లో లైకోపీన్‌ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

ద్రాక్ష ; ద్రాక్షల్లో రెస్వెరాట్రాల్‌ అనబడే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల క్యాన్సర్‌ నివారణకు ఈ ద్రాక్ష బాగా ఉపకరిస్తుంది.