Healthy Lips : పెదవుల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించి చూడండి!

రోజువారిగా నీటిని సరిపడిన మోతాదులో తీసుకోవాలి. డీ హైడ్రేషన్ కారణంగా కూడా పెదవులు పొడిబారిపోతాయి. తద్వారా కళావిహీనంగా మారతాయి. కాబట్టి రోజువారిగా తగిన మోతాదులో నీరు తీసుకుంటే పెదవులు తాజాగా మెరుపుదనంతో ఉంటాయి.

Healthy Lips : పెదవుల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించి చూడండి!

How To Take Care of Your Lips Naturally?

Healthy Lips : కవులు పెదవులను తమ కవిత్వంలో గులాబీ రేకులతో పోలుస్తారు. ముఖానికి ముందుండే పెదవులే అందాన్ని ఇస్తాయి. సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండే పెదవులను ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. పెదవులు పొడి బారటం , నల్లగా మారటం వల్ల ముఖంలో అందం కరువవుతుంది. కొన్ని రకాల చిట్కాలను అనుసరించటం ద్వారా పెదవులు అందంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. అవేంటో చూద్దాం…

1. బాదం నూనె, తేనె, ఒక టీ స్పూన్ చక్కెర తీసుకుని మిశ్రమంగా మార్చుకోవాలి. దానిని పెదవులకు స్క్రబ్ గా వేసుకోవాలి. పెదవులపై సున్నితంగా అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల పెదవులపై మృతచర్మం తొలగిపోతుంది. పెదవులకు తేమ వచ్చి గులాబీ రంగు పెదాలు సొంతమౌతాయి.

2. కలబంద మొక్కల నుండి అకులను సేకరించి అకుల్లో ఉన్న గుజ్జును వేరు చేయాలి. ఆగుజ్జును పెదవులపై అప్లై చేయటం ద్వారా పెదవులను మృధువుగా అందంగా మార్చుకోవచ్చు.

3. రాత్రి నిద్రకు ముందు పెదవులకు కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె ను రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల పెదవులు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

4. రోజువారిగా నీటిని సరిపడిన మోతాదులో తీసుకోవాలి. డీ హైడ్రేషన్ కారణంగా కూడా పెదవులు పొడిబారిపోతాయి. తద్వారా కళావిహీనంగా మారతాయి. కాబట్టి రోజువారిగా తగిన మోతాదులో నీరు తీసుకుంటే పెదవులు తాజాగా మెరుపుదనంతో ఉంటాయి.

5. పెదవులుకు చాలా మంది లిఫ్టిక్ వేస్తుంటారు. రసాయనాలతో తయారయ్యే లిప్టిక్ వల్ల పెదవుల సహజత్వం దెబ్బతింటుంది. కాబట్టి నేచరుల గా లభించే దానిమ్మ రసం, బీట్ రూట్ రసాన్ని ఉపయోగించటం ద్వారా పెదవులు మంచి రంగులో ఉండేలా చూసుకోవచ్చు. అంతేకాకుండా పొడి బారటాన్ని నివారించవచ్చు.

6. లిఫ్టిక్ ను డైరెక్ట్ గా పెదవులపై వేసుకోకుండా ముందుగా పెదవులకు కొంచెం కొబ్బరినూనె అప్లై చేసుకోవాలి. ఆతరువాత మాత్రమే లిఫ్టిక్ పూసుకోవాలి. కొబ్బరి నూనె పెదవులకు నష్టం కలగకుండా రక్షణ కవచంలా దోహదపడుతుంది. పెదవులకు తేమను అందిస్తుంది.

7. గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలకు పట్టించాలి. ఇలా చేస్తే పెదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి. వారానికి ఒకసారి టూత్ బ్రష్ తో పెదాలపై మృదువుగా రుద్దితే అక్కడ మృత చర్మం పోతుంది.