Hypertension : హైపర్ టెన్షన్ తగ్గించటంలో సహాయపడే ఆహారాలు, పానీయాలు!

ఓట్స్ అధిక ఫైబర్, తక్కువ కొవ్వు,తక్కువ సోడియం కలిగి ఉండే ఆహారం. రక్తపోటును సమతుల్యస్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుకు అవిసెగింజలు బాగా ఉపకరిస్తాయి.

Hypertension : హైపర్ టెన్షన్ తగ్గించటంలో సహాయపడే ఆహారాలు, పానీయాలు!

Hypertension

Hypertension : ప్రపంచవ్యాప్తంగా మరణాలకు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణంగా మారుతుంది. హైపర్ టెన్షన్ లక్షణాలను చాలా మంది గుర్తించలేని పరిస్ధితుల్లో ఉన్నారు. రక్తపోటు,అధిక రక్తపోటు ప్రధాన కారణాలలో ఒకటి ఒత్తిడి. చెడు జీవనశైలి, అలవాట్లు, అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా గుండెపోటు, స్ట్రోక్ ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ఉత్తమం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఆహారాలు తీసుకోవాలి. అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని పానీయాలు, ఆహారాలు ఎంతగానో దోహదపడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

రక్తపోటును తగ్గించే పానీయాలు ; రక్తపోటును తగ్గించటంలో మందారం టీ బాగా ఉపకరిస్తుంది. మందార టీలో ఆంథోసైని, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఈ రెండూ ఉపకరిస్తాయి. అలాగే గ్రీన్ కూడా రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉన్నందున అధిక రక్తపోటును ఎదుర్కోవడంలో కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పాలీఫెనాల్స్ శక్తివంతమైన, మొక్కల ఆధారిత పోషకాలు గ్రీన్ టీలో ఉంటాయి. బీట్ రూట్ రసం రక్తపోటును తగ్గించటంలో దోహదం చేస్తుంది. రక్తపోటును తగ్గించడంతోపాటుగా, కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్ రసం ధమనులను ఉపశమనం కలిగిస్తుంది., ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు 250 ml బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

రక్తపోటును తగ్గించే ఆహారాలు ; అరటి పండ్లు రక్తపోటును నియంత్రించటంలో సహాయపడతాయి. వీటిలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండ్లలో మెగ్నీషియం, కాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా దొరుకుతాయి. అదే విధంగా బ్రోకలీ రక్తపోటును నియంత్రించడంలో బాగా తోడ్పడుతుంది. బ్రోకలీలో రక్తపోటును తగ్గించే కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు సమస్యకు ఉల్లిపాయలు చక్కని ఔషదంగా పనిచేస్తాయి. ఉల్లిపాయల్లో ప్రోస్టాగ్లాండిన్ A తో నిండి ఉంటాయి, ఇది రక్త నాళాలలు కుచించుకుపోకుండా చేస్తుంది. రక్తనాళాల నిరోధకతను తగ్గిస్తుంది, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయ తొక్కలో ఉండే క్వెర్సెటిన్ రక్తపోటును తగ్గించడంలో, ధమనులు అడ్డుపడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

ఓట్స్ అధిక ఫైబర్, తక్కువ కొవ్వు,తక్కువ సోడియం కలిగి ఉండే ఆహారం. రక్తపోటును సమతుల్యస్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుకు అవిసెగింజలు బాగా ఉపకరిస్తాయి. మందులు వాడుతున్నప్పటికీ, అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా గోధుమ గింజలు రక్త పోటును తగ్గిస్తాయి. గోధుమ గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, లిగ్నాన్స్, పెప్టైడ్స్,ఫైబర్ ఉన్నాయి, ఇవి రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే, తగినంత నీరు త్రాగాలి. ప్రతిరోజూ 1 టీస్పూన్ ఉప్పు లేదా 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బేకింగ్ పౌడర్, క్యాన్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, సాల్టెడ్ ఊరగాయలు, చిప్స్, నట్స్, పాప్‌కార్న్ ,బిస్కెట్లు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.