Foods To Avoid : గర్భం దాల్చాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారు ముఖ్యంగా నివారించాల్సిన ఆహారాలు!

తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులలో కాల్షియం ,ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది ఆండ్రోజెన్ ,టెస్టోస్టెరాన్లను పెంచే అణువులను కలిగి ఉంటుంది.

Foods To Avoid : గర్భం దాల్చాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారు ముఖ్యంగా నివారించాల్సిన ఆహారాలు!

Foods to avoid especially for those trying to conceive!

Foods To Avoid : సంతానోత్పత్తి సంక్లిష్టమైనది. మహిళ గర్భం ధరించే సామర్థ్యంలో అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. సంతానోత్పత్తిలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లలను కనాలన్న ఆలోచనకు ముందు కొన్ని ఆహారాలు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. సంతానోత్పత్తికి మంచి పోషకాహారం కీలకం. దీనిపై ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు పోషకాహార విధానాలు, నిర్దిష్ట ఆహారాలపై పరిశోధనలు చేశారు మహిళల్లో సంతోనోత్పత్తిపై రోజువారిగా తీసుకునే ఆహార ప్రభావం ఉన్నట్లు తేలింది.

ప్రస్తుతం స్త్రీలకు సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. అబార్షన్లు ,గర్భాశయ బలహీనత వంటి అనేక సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. గర్భం దాల్చడంలో ,పిండం ఆరోగ్యకరమైన ఆహారం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చక్కెర, ఆల్కహాల్, పాల ఉత్పత్తులు, కొవ్వు పదార్థాలు సంతానలేమికి ముఖ్యకారణాలుగా పరిశోధకులు గుర్తించారు. గర్భం దాల్చాలన్న ప్రణాళికలో ఉన్న వారు ఎలాంటి ఆహారాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు: అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వులు ఉంటాయి. అవి రక్త నాళాలను దెబ్బతీసి, పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా నూనెలో వండిన ఆహారాన్ని తీసుకోవటం నిలిపివేయాలి. మైక్రోవేవ్ చేసిన పాప్ కార్న్ ,పొటాటో చిప్స్ వంటి వాటిని సైతం నివారించాలి. ఇవి కూడా శరీరానికి హాని కలిగిస్తాయి.

2. పురుగుమందులతో పండించిన వాటితో తయారైన ఆహారాలు వద్దు ; వ్యవసాయంలో పురుగుమందుల వాడకం బాగా పెరిగింది. పురుగుమందులతో పండించే కూరగాయలు శరీరానికి చాలా హానికలిగిస్తాయి. పురుగుమందులు కలిపిన కూరగాయలను ఎక్కువగా తినే మహిళల్లో గర్భం దాల్చే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. కాబట్టి సహజంగా పండించిన పండ్లు, కూరగాయలు తినండి.

3. కార్బోహైడ్రేట్లు: శరీరానికి హాని కలిగించే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బియ్యం, మైదా ,గోధుమలను గర్భధారణ సమయంలో లేదా గర్భం దాల్చడానికి ప్రయత్నించే వారు దూరంగా ఉండాలి.

4. డైరీ ప్రొటెక్టివ్: తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులలో కాల్షియం ,ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది ఆండ్రోజెన్ ,టెస్టోస్టెరాన్లను పెంచే అణువులను కలిగి ఉంటుంది. టెస్టోస్టెరాన్ పెరిగితే శరీర ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి స్కిమ్డ్ మిల్క్ వాడకానికి దూరంగా ఉండటం మంచిది. గర్భం ధరించాలన్న ఆలోచనతో ఉన్నవారు, గర్భధారణ సమయంలో శీతల పానీయాలు సేవించటం అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

5. కృత్రిమ స్వీటెనర్లు: కృత్రిమ స్వీటెనర్లు తో తయారైన ఆహారపదార్ధాలను సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఈ కృత్రిమ స్వీటెనర్లను చాక్లెట్లు, క్యాండీలలో చక్కెర స్థానంలో ,మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం తయారు చేసిన చక్కెర రహిత ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ కృత్రిమ స్వీటెనర్లు డీఎన్ఏ పై ప్రభావం చూపుతాయి. సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తాయి.

6. ప్రాసెస్ చేసిన మాంసాలు ; గొడ్డు మాంసం, బేకన్, హాట్ డాగ్‌లు,సాసేజ్ వంటి ఎరుపురంగు, ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వంధ్యత్వానికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతన్నాయి. పెద్ద మొత్తంలో ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని తినే పురుషులు తక్కువ స్పెర్మ్ నాణ్యత, గణన మరియు చలనశీలతను కలిగి ఉంటారని ఒక అధ్యయనం కనుగొన్నారు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల పురుషులలో గుడ్డు ఫలదీకరణం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.మధ్య సంబంధాన్ని అధ్యయనం కనుగొంది.