Health Benefits Of Jamun : డయాబెటిస్‌ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

నేరేడులోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్‌గ్లైసీమియా లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. పండుతో పాటు, విత్తనాలు, ఆకులు మరియు బెరడు నుండి సేకరించిన పదార్దాలు , శరీరంలోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

Health Benefits Of Jamun : డయాబెటిస్‌ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

Jamun

Health Benefits Of Jamun : నోరూరించే రుచికరమైన నేరేడు పండ్లు ఆరోగ్యకరమైనవి. నేరేడు పండు లో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి మరియు బి6 పుష్కలంగా ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణప్రక్రియను వేగవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది.

READ ALSO : JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!

డయాబెటిక్ రోగులు ఈ పండ్లను ప్రతిరోజూ జామున్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ చర్యను మెరుగుపరుస్తుంది. మధుమేహం రాకుండా నిలువరించటంలో ఈ పండ్లు సహాయపడతాయి. నేరేడులో లో జాంబోలిన్ అనే సమ్మేళనం ఉంది, ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ నిరోధకతకు వ్యతిరేకమైన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

నేరేడులోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్‌గ్లైసీమియా లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. పండుతో పాటు, విత్తనాలు, ఆకులు మరియు బెరడు నుండి సేకరించిన పదార్దాలు , శరీరంలోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

READ ALSO : Jamun Fruits : మెదడు, గుండెకు ఔషధంగా పనిచేసే నేరేడు పండ్లు!

నేరేడును అనేక విధాలుగా తినవచ్చు దీనిని పచ్చిగా తినవచ్చు లేదా దాని రసాన్ని తీయవచ్చు. దీనిని సలాడ్‌లు, స్మూతీస్, జామ్‌లు మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు. తీపి, పులుపు, వగరు రుచులతో ఉండే నేరేడు పండ్లు సంవత్సరం పొడుగునా దొరుకుతున్నందున్న ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందేలా చేస్తాయి.

ఆకులు, గింజలు, బెరడు వంటివి వాటిని ఔషదాల తయారీలో కూడా వాడుతున్నారు. అధిక దాహం, అతిమూత్రం వంటి సమస్యల నివారణకు కూడా నేరేడు పండ్లు బాగా ఉపకరిస్తాయి. శరీరంలో క్యాన్సర్ కారకాలు అభివృద్ధి చెందకుండా చేయటంలో సహాయకారిగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరచటంలో తోడ్పడుతుంది.

READ ALSO : Jamun : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు

నోటిలో ఏర్పడే అల్సర్లు, పుండ్లు వంటి వాటిని పొగొట్టటానికి , చిగుళ్ళను బలంగా మార్చటానికి , దంత సమస్యలను నివారించటానికి నేరేడు పండ్లు తినమని నిపుణులు సూచిస్తుంటారు. జీర్ణ శక్తిని పెంపొందించుకునేందుకు , మలబద్ధాకాన్ని నివారించేందుకు చర్మవ్యాధుల నివారణకు సైతం నేరేడు పండ్లు ఉపకరిస్తాయి.