High BP : హైబీపీ అదుపులో ఉంచుకోకపోతే గుండె పోటు, కిడ్నీ సమస్యలు?

హై బీపీని నియంత్రించాలంటే రెడ్‌ మీట్‌, మీగడ, వెన్న, నూనె ఆహారాలకు దూరంగా ఉండాలి. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా కొబ్బరినీరు తాగాలి. వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉండేలా చూడాలి. నిత్యం తప్పనిసరిగా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.

High BP : హైబీపీ అదుపులో ఉంచుకోకపోతే గుండె పోటు, కిడ్నీ సమస్యలు?

high blood pressure

High BP : కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక శ్రమ తక్కువగా ఉండే కూర్చుని చేసే వృత్తుల్లో ఉండటం, రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి, ఊబకాయం, ఆహారంలో మార్పులు వంటి అంశాలు హైబీపీకి కారణమౌతున్నాయి. దీని ప్రభావం మొత్తం ఆరోగ్యంపై పడుతుంది. అనేక అవయవాలు హైబీపీ కారణంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా హైబీపీ వల్ల గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్‌, కిడ్నీ దెబ్బతినడం, పక్షవాతం, లైఫ్‌ స్పాన్‌ తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయడం సాధ్య పడదు. రక్తపోటు పెరగడం వల్ల ఎండ్‌ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. కంగారు, ఆందోళ‌న‌, అల‌స‌ట‌, నిద్రలేమి స‌మ‌స్యలు ఉంటే హైబీపీగా అనుమానించాలి. హై బీపీ వల్ల ముక్కులో నుండి రక్తం రావడం, తలనొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మూర్ఛ రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం కూడా హై బీపీ లక్షణాలే.

హై బీపీని నియంత్రించాలంటే రెడ్‌ మీట్‌, మీగడ, వెన్న, నూనె ఆహారాలకు దూరంగా ఉండాలి. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా కొబ్బరినీరు తాగాలి. వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉండేలా చూడాలి. నిత్యం తప్పనిసరిగా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. నిమ్మరసం నిత్యం తీసుకోవాలి. అప్పుడప్పుడు ఉల్లిపాయ రసం సేవించాలి. ఎక్కువ సేపు కుర్చీకి అత్తుకుని కూర్చోకుండా చూసుకోవాలి. సిగరెట్‌, మద్యం సేవించే అలవాటును మానుకోవాలి. ఆహారంలో ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. నిత్యం ఒక అరటిపండు అయినా తినాలి.

రక్తపోటు 140/90 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే హై బీపీగా పరిగణిస్తారు. దీనిని పట్టించుకోకుండా వదిలేస్తే గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు అధికం. ఆరోగ్య అలవాట్ల వల్ల చాలామంది హై బీపీ బారినపడుతుంటే, ఇవేవీ లేకపోయినా కూడా కొంతమంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. హైబీపీ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందటం ఉత్తమం. రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో మేలు.