Black Hair : తెల్లజుట్టును నల్లగా మార్చే హోం రెమిడీస్!

తెల్లజుట్టును నివారించడంలో ఎఫెక్టివ్ హోం మేడ్ మెడిసిన్ గా ఉసిరిని చెప్పవచ్చు. దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని ఉసిరికాయ ముక్కలను ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి.

Black Hair : తెల్లజుట్టును నల్లగా మార్చే హోం రెమిడీస్!

Black Hair

Black Hair : ఇటీవలి కాలంలో చాలా మంది చిన్నవయస్సులోనే తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. నలుగురిలో తెల్లజుట్టుతో తిరిగేందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. మారిన జీవన శైలి , ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడుగా జుట్టు రాలిపోయి బట్టతల సమస్యకూడా వేధిస్తుంది. అంతేకాకుండా తలస్నానం కోసం ఉపయోగించి వివిధ రకాల రసాయనాలతో తయారైన షాంపుల కారణంగా కూడా నల్ల జుట్టు కాస్తా తెల్లగా మారిపోతుంది. ఈ నేపధ్యంలో కొన్ని గృహచిట్కాలతో తెల్లగా మారిన జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

హెన్నా: హెన్నాతెల్ల జుట్టును నివారించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. హెన్నా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెన్నాలో కాఫీ డికాషన్ మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకుని, రెండు మూడు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్, రంగు వస్తుంది. తెల్ల జుట్టు కనబడకుండా చేస్తుంది.

కరివేపాకు: కరివేపాకును పురాతన కాలం నుండి అందానికి దీనిని ఉపయోగిస్తున్నారు. తెల్ల జుట్టును నివారించడంలో కరివేపాకు సహాయపడుతుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను ఒక బాటిల్ లో నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తలకు అప్లైచేయవచ్చు. ఈ ఆయిల్ జుట్టురాలటాన్ని క్రమబద్దం చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తి పెంచుతుంది. హెయిర్ కు మంచి నలుపు రంగు వచ్చేలా చేస్తుంది.

బ్లాక్ టీ: తెల్ల జుట్టును నివారించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లాక్ టీ . రెండు టీస్పూన్ల బ్లాక్ టీ ఆకులను నీళ్లలో వేసి ఉడికించి, చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి, ఒక గంట తర్వాత షాంపు లేకుండా తలస్నానం చేయాలి. జుట్టును నల్లగా మారుతుంది.

ఉసిరి: తెల్లజుట్టును నివారించడంలో ఎఫెక్టివ్ హోం మేడ్ మెడిసిన్ గా ఉసిరిని చెప్పవచ్చు. దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని ఉసిరికాయ ముక్కలను ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. ఈ ఆయిల్ ను తరచూ తలకు అప్లై చేస్తుంటే తెల్ల జుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఈనూనెలో ఉండే యాంటీఏజింగ్ బెణిఫిట్స్ హెయిర్ పిగ్మేంటేషన్ ను నివారిస్తుంది. ఈ నూనె డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. బ్లాక్ హెయిర్ ను అందిస్తుంది.

మెంతులు : తెల్లజుట్టును నివారించడంలో మెంతులు బాగా ఉపకరిస్తాయి. మెంతుల మొలకలను తినడం లేదా మెంతులను నానబెట్టిన నీళ్ళు తాగడం, మెంతి పేస్ట్ ను తలకు ప్యాక్ గా వేయటం వల్ల తెల్ల జుట్టు నివారించుకోవచ్చు. మెంతుల్లో ఉండే న్యూట్రీషియన్స్, విటమిన్ సి , ఐరన్ పొటాషియం మరియు లిసైన్స్ జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది. ఇది తెల్ల జుట్టును నివారిస్తుంది.

నువ్వుల నూనె: నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు క్రమేపి నల్లగా మారుతుంది.

విటమిన్ బి 12 : విటమిన్ బి12 లోపించడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. రోజువారి ఆహారం లో విటమిన్ బి12 అధికంగా ఉండే పోర్క్, బీఫ్ , ల్యాంబ్, డైరీ ప్రొడక్ట్స్ ను పాలు,చీజ్ గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

థైరాయిడ్ లెవల్స్ ; థైరాయిడ్ గ్రంథులు శరీరంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోనుల అసమతుల్యత వల్ల కూడా తెల్ల జుట్టుకు కారణమవుతుంది. కాబట్టి, థైరాయిడ్ చెక్ చేయించుకోవడం వల్ల హార్మోన్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.

స్మోకింగ్ నిలపాలి: జుట్టు ఆరోగ్యం మీద జీవనశైలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన తీసుకునే ఆహారం, అలవాట్లే మన ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని తెలుపుతాయి. కాబట్టి, జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉండాలంటే, స్మోకింగ్ మానేయాలి.