Black Tea : బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే!..

రక్తపోటుతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజుకు కనీసం మూడు కప్పుల బ్లాక్ టీ తాగాలని , తద్వారా సమస్య తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మూడు కప్పుల టీ తాగే వారిలో రక్తపోటు తగ్గినట్లు

Black Tea : బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే!..

Black Tea

Black Tea : ఉదయం నిద్రలేచిన వెంటనే టీ త్రాగకుండా ఉండలేరు చాలా మంది. టీ తాగటం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటామని మెదడు చురుకుగా పనిచేస్తుందన్న భావన చాలామందిలో ఉంది. ఇదే విషయం పలు అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే టీ తాగేవారు. పొద్దున్నేమనం తాగే టీలో పాలు, కలుపుకుని తాగుతాం. అలా కాకుండా బ్లాక్ టీని తాగితే ఆరోగ్యపరంగా పంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ టీ పొడి కామెల్లియా సినెసిస్ అనే మొక్క ఆకులను పొడిగా చేయటం వల్ల తయారవుతుంది. ఈ టీ చిక్కని ముదురురంగులో ఉండటంతోపాటు కాఫీతో పోలిస్తే తక్కువ మోతాదులో కెఫిన్ ఉంటుంది.

రోజూ బ్లాక్‌ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యకరంగా ఉంటుందట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు, బ్లాక్‌ టీ ఒంటినొప్పులను కూడా తగ్గిస్తుంది. మలబద్ధ్దకం సమస్య పరిష్కారమౌతుందని పరిశోధకులు నిర్ధారించారు. కాకపోతే చక్కెర స్థానంలో తేనె, బెల్లం మొదలైన సహజ తీపి పదార్థాలను కలుపుకోవాలి.

రక్తపోటుతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజుకు కనీసం మూడు కప్పుల బ్లాక్ టీ తాగాలని , తద్వారా సమస్య తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మూడు కప్పుల టీ తాగే వారిలో రక్తపోటు తగ్గినట్లు యూనివర్శిటీ ఆఫ్ వెస్టర్న్ అస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. ఒక కప్పు బ్లాక్ టీని తయారు చేసుకోవాలంటే 50 నుండి 60 మి.లీ నీటిలో తగినంత టీ పొడి వేసి బాగా కాగనివ్వాలి. పోసిన నీరు 30 నుండి 40 మి.లీ వరకు చేరేలా బాగా మరిగించాలి.

గ్రీన్ టీ కంటే బ్లాక్ టీని తాగటం వల్ల క్యాన్సర్, గుండె పోటు, డయాబెటీస్, నోటి సమస్యలు తగ్గతున్నాయట. ఆహారం ద్వారా వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు బ్లాక్ టీ చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. టీ అనేది కొన్ని రకాల ఫ్లూ, ఆహారనాళం, పొట్ట క్యాన్సర్లను నయంచేసే గుణాలను కలిగి ఉంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో బ్లాక్ టీ ఎంతగానో దోహదపడతాయని పరిశోధకులు తేల్చారు. ఇందులో ఉండే ఫ్లోరైడ్ దంతాలను దృఢపరిచేందుకు ఉపయోగపడతాయి. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాదులతో బాధపడేవారికి బ్లాక్ టీ చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. అందులో ఉండే ఫ్లనాయిడ్స్ ఆస్తమానుండి ఉపసమనం కలిగిస్తాయి.