Turmeric Water : గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

పసుపు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారించుకోవటానికి, పసుపులో ఉండే కర్కుమిన్ ఆక్సీకరణ నష్టాన్ని, వాపును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.

Turmeric Water : గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

turmeric water

Turmeric Water : పసుపులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. అనేక వ్యాధులను తగ్గించటంలో ఇది సహాయకారిగా పనిచేస్తుంది. ప్రతిరోజు గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా పసుపును కలుపుకుని తాగటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. యూరోపియన్ రిఫ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పసుపు పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకుని తాగడం వల్ల శరీర మంట తగ్గుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి.

పసుపు నీరు చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా చేయడంతో పాటుగా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పసుపు క్యాన్సర్ కణాలను ఇతర భాగాలకు వ్యాపించకుండా చేయడానికి, కణితిని తొలగించడానికి సహాయపుతుంది. శరీరంలో ఉండే విషపదార్ధాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. పసుపు నీరు రోజు తీసుకోవటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఎన్నో రకాల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి.

పసుపు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారించుకోవటానికి, పసుపులో ఉండే కర్కుమిన్ ఆక్సీకరణ నష్టాన్ని, వాపును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. పుసుపులో ఉండే ఔషదగుణాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పుసుపులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ తో పాటుగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. కొద్ది మొత్తంలో రోజూ పసుపు నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. పసుపు నీటితో తీసుకుంటే జీవక్రియ మెరుగవుతాయి.