Liver problem: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ సమస్య ఉన్నట్లే…

కాలేయంలో గడ్డలు వంటివి ఏర్పడినప్పుడు నొప్పి మెలిపెడుతుంటుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు లక్షణాలు బయటపడుతాయి.

Liver problem: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ సమస్య ఉన్నట్లే…

Liver

Liver problem: మ‌న శ‌రీరంలోని అతి పెద్ద గ్రంథి లివ‌ర్‌. ఇది అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. ఇది చేసే పనులు చాలా ముఖ్యమైనవి. మనిషి శరీరంలో 500కి పైగా పనులను కాలేయం నిర్వహిస్తుంది. శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ఓ ప్రయోగశాలగా కాలేయం పనిచేస్తుంది.

శక్తిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు దానిని వినియోగించటం, హార్మోన్లను కంట్రోల్ చేయటం, మనం తిన్న ఆహారం జీర్ణం చేయటం వంటి అనేక పనులను లివర్ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ‌, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, పోష‌కాల‌ను గ్ర‌హించి నిల్వ చేయ‌డం, ఇంకా ప‌లు ఇత‌ర ప‌నులను లివ‌ర్ నిర్వ‌ర్తిస్తుంది.

అయితే మనం పాటించే జీవ‌న‌విధానం, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి లివ‌ర్ దెబ్బ తింటుంది. కలుషిత నీరు, కలుషిత ఆహారం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తాగడం కాలేయం సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలు. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని బ‌ట్టి మ‌నం మ‌న లివ‌ర్ చెడిపోయింద‌ని అర్థం చేసుకోవాలి. కొంద‌రికి ఈ స‌మ‌స్య ప్రారంభంలోనే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారంటే ఎల్ల‌ప్పుడూ తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. ఏ మాత్రం ప‌ని చేయ‌లేరు. నిస్స‌త్తువ‌గా ఉంటారు. చాలా వీక్‌గా ఉంటారు. ఏ ప‌నిచేయ‌బోయినా అల‌సిపోయిన‌ట్టు ఉంటారు. వికారం ఉంటుంది. ఆక‌లి వేయ‌దు. డ‌యేరియా స‌మ‌స్య వ‌స్తుంది. దీన్ని బట్టి లివ‌ర్ చెడిపోయింద‌ని అనుకోవ‌చ్చు. అప్పుడు వైద్యున్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.

లివ‌ర్ చెడిపోయిన వారికి కామెర్లు వ‌స్తే శ‌రీరం అంతా ప‌సుపు రంగులోకి మారుతుంది. ఇది ప్ర‌ధాన ల‌క్ష‌ణం. క‌ళ్లు, చ‌ర్మం ప‌సుపు రంగులో క‌నిపిస్తాయి. ఈ విధంగా క‌నిపిస్తే వెంట‌నే జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి త‌ప్ప‌నిసరిగా చికిత్స తీసుకోవాలి. కాలేయ వ్యాధులకు మరో సూచన డార్క్ ఎల్లో యూరిన్ . ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకొని సమస్యను తెలుసుకోవాలి.

లివ‌ర్ చెడిపోయిన వారిలో పాదాల వాపులు వ‌స్తుంటాయి. త‌రచూ జ్వ‌రం వ‌స్తుంది. వికారంగా ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా. లివ‌ర్ స‌మస్య ఉన్న‌వారిలో చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తుంటాయి. మూత్రం ముదురు ప‌సుపు రంగులో వ‌స్తుంది. కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే కొంద‌రికి పొత్తి క‌డుపులో నొప్పి వ‌స్తుంటుంది. లివ‌ర్ ఉన్న చోట పైన వాపులు క‌నిపిస్తాయి.

శ‌రీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నా లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డార‌ని తెలుసుకోవాలి. లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు, డ‌యాబెటిస్ వ‌స్తాయి. లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. ర‌క్త నాళాల వాపు క‌నిపిస్తుంది. దీంతో లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని అర్థం చేసుకోవాలి. లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా చ‌ర్మంపై దుర‌ద‌లు, ద‌ద్దుర్లు వ‌స్తాయి. చ‌ర్మ స్పెష‌లిస్టుకు చూపించి మందులు వాడినా త‌గ్గ‌క‌పోతే అప్పుడు దాన్ని లివ‌ర్ స‌మ‌స్య‌గా గుర్తించి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

లివ‌ర్ స‌మ‌స్య ఉంటే ఆక‌లి స‌రిగ్గా కాదు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. బ‌రువు త‌గ్గిపోతారు. చిన్న ప‌ని చేసినా తీవ్ర‌మైన అల‌స‌ట వ‌స్తుంది. గాయాలు తేలిగ్గా అవుతుంటాయి. లివ‌ర్ ఆరోగ్యం బాగాలేక‌పోతే కొంద‌రికి వాంతుల్లో ర‌క్తం క‌నిపిస్తుంది. మ‌లంలోనూ ర‌క్తం వ‌స్తుంది. నోట్లో దుర్వాస‌న ఉంటుంది.లివ‌ర్ చెడిపోయిన వారు ఎప్పుడూ నిద్ర మ‌త్తులో ఉంటారు. బ‌ద్ద‌కంగా అనిపిస్తుంది. ఏ ప‌నిచేయ‌డానికైనా వెనుదీస్తుంటారు. అంత‌గా ఆస‌క్తి ఉండ‌దు. కంగారు, ఆందోళ‌న ఉంటాయి.

కాలేయంలో గడ్డలు వంటివి ఏర్పడినప్పుడు నొప్పి మెలిపెడుతుంటుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు లక్షణాలు బయటపడుతాయి. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.

ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే వెంట‌నే అప్ర‌మ‌త్తం అవ్వాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి లివ‌ర్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఏదైనా స‌మ‌స్య ఉంటే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. దీంతో ముందుగానే లివ‌ర్ వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ప్రతి రోజూ వాకింగ్ చేయడం, కండరాలను బలోపేతం చేసే వ్యాయామం చేయడం ద్వారా ప్రాణాంతక కాలేయ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని సూచించారు. ఒబేసిటీ కూడా కాలేయ వ్యాధులకు కారణమవుతున్నట్లు తేల్చారు.