Menopause : మోనోపాజ్ దశ తరువాత రక్తస్రావం ప్రమాదకరమా!..

మెనోపాజ్‌ దశ దాటాక హార్మోన్లు వాడే వారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ కోసం వాడే టామోక్సిఫిన్‌ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్‌, మరికొందరిలో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావచ్చు

Menopause : మోనోపాజ్ దశ తరువాత రక్తస్రావం ప్రమాదకరమా!..

Menopause

Menopause : పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం వయస్పు మళ్ళే కొద్ది నిలిచిపోతుంది. దీనినే మోనోపాజ్ దశ అంటారు. నెలసరి సమయంలో రక్తస్రావం కావటం ఎంత సహజమో, మోనోపాజ్ దశ వచ్చాక రక్తస్రావం కావటం కూడా అంతే ప్రమాదకరం. మోనోపాజ్ దశలో స్త్రీ శరీరంలోని అండాశయాల్లో నిల్వ ఉన్న అండాలన్నీ కరిగిపోయి అండాల విడుదల ఆగిపోతుంది. హర్మోన్ల ఉత్పత్తి ఉండదు. ఆసమయంలో రక్తస్రావం జరిగితే సాధారణంగా బావించకూడదు. 50,60ఏళ్ళు దాటాక రక్తస్రావం కనిపిస్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 40ఏళ్ల లోపు రుతుక్రమంలో మార్పు వస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృద్ధాప్యంలో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే చాలామంది కంగారుపడుతుంటారు. వైద్యుల వద్దకు వెళితే జననేంద్రియభాగం చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలనూ పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, అక్కడి నుంచి రక్తస్రావం అవుతుంది.జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్‌, ఉన్నా ఇలా జరుగుతుంది. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్‌ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది.

మెనోపాజ్‌ దశ దాటాక హార్మోన్లు వాడే వారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ కోసం వాడే టామోక్సిఫిన్‌ వల్ల… గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్‌, మరికొందరిలో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. ఈ పరిస్థితిని లించ్‌ సిండ్రోమ్‌ అంటారు. ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్‌ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడూ రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరంలేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది.

మోనోపాజ్ దశ దాటిన తరువాత తగిన జాగ్రత్తలు పాటించటం అవసరం. అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం ఉన్నవారికి రెండు నుంచి నాలుగు రెట్లు సమస్య బారినపడే అవకాశాలెక్కువ. కాబట్టి వ్యాయామం చేయడం తప్పనిసరి. పిల్లలు పుట్టాక వైద్యుల సలహాతో గర్భనిరోధక మాత్రలు లేదా ప్రొజెస్టరాన్‌ లూప్‌ ని వాడటం వల్ల ఎండోమెట్రియం పొర ఎదుగుదలను అదుపులో ఉంచొచ్చు. హెచ్‌ఆర్‌టీ తీసుకునే వారు ఈస్ట్రోజెన్‌తో పాటూ తప్పనిసరిగా ప్రొజెస్టరాన్‌ని వాడాలి. కుటుంబంలో లింఛ్‌ సిండ్రోమ్‌ ఉన్న స్త్రీలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.