Listen Music : గుండె ఆరోగ్యానికి సంగీతం వినటం మంచిదేనా? రోజులో ఒక్క అరగంట సంగీతం వింటే!

మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి. ఒత్తిడి తొలిగిపోతే మనిషి ఉల్లాసంగా మారతాడు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

Listen Music : గుండె ఆరోగ్యానికి సంగీతం వినటం మంచిదేనా? రోజులో ఒక్క అరగంట సంగీతం వింటే!

Is listening to music good for heart health? If you listen to music for half an hour a day!

Listen Music : శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం. గుండె పనిచేస్తున్నంత సేపు మాత్రమే.. మనం ఆరోగ్యంగా ఉండగలం. గుండె కొట్టుకోవడం ఆగిపోతే మన ప్రాణం పోయినట్లే. గుండెను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గుండె ఆరోగ్యానికి పోషకాహం ఎంతముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇందుకోసం సంగీతం వంటివి బాగా ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె పనితీరు సక్రమంగా ఉండేందుకు సంగీతం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రతిరోజు ఒక అరగంటపాటు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల గుండె పనితీరు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు సంగీతం వింటూ తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గుండెకు మేలు కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి. ఒత్తిడి తొలిగిపోతే మనిషి ఉల్లాసంగా మారతాడు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వీటితోపాటు చెడు అవాట్లకు దూరంగా ఉండటం మంచిది. పొగతాగటం, మద్యం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడాని ధ్యానం,కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం, లేదా పెంపుడు జంతువులతో గడపడం వంటి వాటిల్లో నిమగ్నం కావాలి.