Cold Water : చలికాలంలో చన్నీటి స్నానం ఆరోగ్యానికి మేలేనా? ఎవరు చల్లని నీటితో స్నానం చేయకూడదో తెలుసా?

జ్వరం, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నట్లయితే, చల్లటి నీటితో స్నానం చేయవద్దు, అలా చేయడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం సరైందికాదు.

Cold Water : చలికాలంలో చన్నీటి స్నానం ఆరోగ్యానికి మేలేనా? ఎవరు చల్లని నీటితో స్నానం చేయకూడదో తెలుసా?

Is rain bath in winter good for health? You know who doesn't want to shower with cold water?

Cold Water : చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వేడి నీళ్లతో చేసిన దాని కంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చన్నీటి స్నానం చేయడమే మంచిదని నిపుణులు అంటున్నారు. చలికాలంలో ఉదయం వేళ చల్లటి నీటిని తాకగానే మన బాడీలో వెబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఉదయం లేవటానికి కూడా బద్దకంగా ఉంటుంది. వేడివేడి నీళ్లతో స్నానం చేయాలని పిస్తుంది. కొంతమంది అసలు స్నానం చేయటానికే ఇష్టపడరు. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా, ఉదయాన్నే లేచి స్నానం చేయడం చాలా అవసరం. అది కూడా చల్లటి నీటితో స్నానం చేస్తే ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

స్నానం చేయడం వలన శరీరం పరిశుభ్రంగా ఉండటంతోపాటు కండరాల ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణను మెరుగవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. శరీరంపై పడే చల్లని నీటి జల్లులు లోపలి నుంచి వెచ్చదనాన్ని కలిగిస్తాయి. వేడినీటితో స్నానం చేస్తే చర్మం వెచ్చని అనుభూతి పొందినప్పటికీ, రక్తం చర్మం ఉపరితలం వైపు కదులుతుంది. ఇది చల్లని ప్రభావాన్ని తప్పికొడుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలంగా తయారవుతాయి, రక్తపోటు తగ్గుతుంది. మీరు ఫిట్‌గా ఉండాలంటే చల్లటినీటితో స్నానం చేయమని నిపుణులు సూచిస్తున్నారు.

1. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది చలికాలంలో వేడి నీటి స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. చర్మంపై మొటిమలు, దద్దుర్లు కూడా ఏర్పడతాయి. చుండ్రు సమస్యలతో కూడా ఇబ్బందిపడతారు. అయితే చల్లటి నీటి స్నానం చర్మంపై మురికి చేరకుండా అడ్డుకుంటుంది. సహజ నూనెలు చర్మం నుండి బయటకు వెళ్లకుండా ఉంటాయి.

2. చల్లని నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.చల్లటి నీటితో స్నానం చేస్తే, తెల్ల రక్త కణాల శాతం పెరుగుతుంది, జీవక్రియ రేటు మెరుగవుతుంది. ఎందుకంటే చల్లటి స్నానంతో శరీరం దానంతటదే వేడెక్కడానికి ప్రయత్నిస్తుంది, ఆ ప్రక్రియలో తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది.

3. కండరాలు పట్టుకోవటం వంటి జరిగితే చన్నీటి స్నానంతో వేగంగా కండరాలను పూర్వస్థితికి తీసుకురావచ్చు. కండరాల నొప్పిని అధిగమించడానికి చన్నీటి స్నానం తోడ్పడుతుంది.

4. చల్లటి నీరు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిలో ఉంటే చల్లటి షవర్ కింద కాసేపు ఉండండి. బయటికి వచ్చిన తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఉంటారు.

అదే క్రమంలో కొందరు మాత్రం చల్లటి నీటితో స్నానం చేయరాదు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారు చన్నీటి స్నానాన్ని నివారించటం మంచిది. జ్వరం, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నట్లయితే, చల్లటి నీటితో స్నానం చేయవద్దు, అలా చేయడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం సరైందికాదు.

చల్లటి నీటితో జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చికాకు, జ్వరం వంటి అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి నీటిని స్నానానికి ఎంచుకునే ముందు వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవటం మంచిది.