Jalandhara Bandhasana : థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరిచి, జీవక్రియలు వేగవంతం చేసే జలంధర బంధాసనం!

జలంధర బంధాసనం వేసే ముందు పద్మాసనంలో కూర్చోవాలి. వెన్ను, మెడ నిటారుగా ఉంచాలి. అరచేతులను మడిచి మోకాళ్లపై ఉంచాలి.

Jalandhara Bandhasana : థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరిచి, జీవక్రియలు వేగవంతం చేసే జలంధర బంధాసనం!

Jalandhara Bandhasana

Jalandhara Bandhasana : శరీరంలో నాడీ, జీవక్రియలు మెరుగుపరచటంతో పాటు శరీరాన్ని యవ్వనంగా ఉంచటంలో యోగా బాగా ఉపకరిస్తుంది. ఈ ఆసనం రోజువారిగా వేయటం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగవుతుంది. జీవక్రియలు వేగవంతం అవుతాయి. ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.

గొంతు సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. ముఖ కండరాలకు శక్తిని చేకూరుస్తుంది. అందంగా కనిపించేలా చేస్తుంది. మెడనొప్పి, తలతిరగటం, హైబీపి, గుండె జబ్బులన్న వారు దీనిని చేయకూడదు. ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. నిపుణుల పర్యవేక్షణలో దీనిని చేయటం మంచిది.

జలంధర బంధాసనం వేసే విధానం ;

జలంధర బంధాసనం వేసే ముందు పద్మాసనంలో కూర్చోవాలి. వెన్ను, మెడ నిటారుగా ఉంచాలి. అరచేతులను మడిచి మోకాళ్లపై ఉంచాలి. నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఆశ్వాసను లోపలే ఆపి తలను కిందికి వంచి గెడ్డాన్ని ఛాతికి అదిమి ఉంచాలి.

ఈ స్ధితిలో ఉండగలగినంత సేపు ఉండి తల ఎత్తి యధాస్ధితికి రావాలి. తొలసారి చేసేవాళ్లు తొలుత ఐదు సెకన్ల పాటు నిలిపి సమయాన్ని పెంచుకోవాలి. ఇలా నాలుగు సార్లు చేయాలి. గాలి పీల్చి బిగబట్టే సమయంలో చేతులు కొంచెం చాపు కోవచ్చు. శ్వాసను లోపలకు లాగి చేసినట్లే , శ్వాసను బయటకు వదిలి కూడా చేయవచ్చు.