Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..

సగ్గు బియ్యాన్ని నీటిలో ఉండికించి పంచదార కలుపుకుని తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారంగా చెప్పవచ్చు. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు.

Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..

Saggu Biyyam

Saggu biyyam : అధిక బరువు సమస్య ఇటీవలి కాలంలో అందరిని బాధిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అధిక బరువు సమస్య వేధిస్తోంది. దీనిని నుండి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు ఉండదు. అయితే కొన్ని చకాల చిట్కాలు బరువును తగ్గించటంలో కొంతమేర సహాయపడతాయి. అలాంటి వాటిలో సగ్గు బియ్యం కూడా ఒకటి. సహజంగా బరువు తగ్గించటానికి సగ్గు బియ్యం ఒక మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా సగ్గుబియ్యం వాడటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. బరువు గ్గాలనుకునే వారికే కాదు, చిన్న పిల్లలకు తినే ఆహార పదార్ధంగా సగ్గు బియ్యాన్ని ఉపయోగించవచ్చు. సగ్గు బియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం. ఇందులో పోషకాల శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అధిక వేడి ఉన్నవారు సైతం సగ్గు బియ్యాన్ని జావగా కాసుకుని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. సగ్గు బియ్యాన్ని డైట్‌గా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

సగ్గు బియ్యాన్ని నీటిలో ఉండికించి పంచదార కలుపుకుని తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారంగా చెప్పవచ్చు. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి. కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి. బియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సగ్గు బియ్యం మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉదయం లేదా, సాయంత్రం అల్పాహారంగా వీటిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.