భారత్‌లోనూ మాల్దీవుల్లాంటి లొకేషన్లు

నీటిలో ఉండే భవనాలు మాల్దీవుల్లోనే ఉంటాయంటే ఒప్పుకోని వాళ్లుండరు. 1960ల కాలంలో తాహితీ అనే ప్రదేశంలో కట్టిన బంగ్లా నుంచి మాల్దీవుల్లో ఈ కట్టడాలు మొదలయ్యాయి.

భారత్‌లోనూ మాల్దీవుల్లాంటి లొకేషన్లు

నీటిలో ఉండే భవనాలు మాల్దీవుల్లోనే ఉంటాయంటే ఒప్పుకోని వాళ్లుండరు. 1960ల కాలంలో తాహితీ అనే ప్రదేశంలో కట్టిన బంగ్లా నుంచి మాల్దీవుల్లో ఈ కట్టడాలు మొదలయ్యాయి.

ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, నీటిలో ఉండే భవనాలు మాల్దీవుల్లోనే ఉంటాయంటే ఒప్పుకోని వాళ్లుండరు. 1960ల కాలంలో తాహితీ అనే ప్రదేశంలో కట్టిన బంగ్లా నుంచి మాల్దీవుల్లో ఈ కట్టడాలు మొదలయ్యాయి. ఇటువంటివే ఇప్పుడు భారత్‌లోనూ సిద్దమవుతున్నాయి. అవెక్కడో తెలుసుకోవాలనుందా..

నీతి అయోగ్ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్ష్యద్వీప్ లలో నీటిపై బిల్డింగ్‌లు, వాటర్ విల్లాలు నిర్మించేందుకు రూ.1500కోట్లు కేటాయించింది. ఈ డబ్బు కేవలం బిల్డింగ్‌లు కట్టడానికి మాత్రమే కాదు. ఎయిర్‍‌పోర్టు నిర్మాణాలు, హెలికాప్టర్ సర్వీసులు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా రెడీ చేస్తున్నారు. 

water villas are soon coming to India

 

అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో 460గదులతో ల్యాండ్ విల్లాలను, అవేస్, స్మిత్, షాహిద్ ఐలాండ్‌లపై, లక్ష్యద్వీప్ ఐలాండ్స్‌లో 125గదులతో, మినికోయ్, సుహేలీ, కడ్మత్ ఐలాండ్స్‌లోనూ విల్లాల నిర్మాణం చేపడతారు. వీటి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించనుంది. 

water villas are soon coming to India

 

ప్రఖ్యాత మీడియా ‘ద హిందూ’ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించినట్లు ప్రచురించింది. అండమాన్ నికోబార్‌లో మూడు విల్లాలు, లక్ష్యద్వీప్ లో ఒక విల్లా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. పర్యావరణానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ వచ్చేశాయి. దీంతో కాంట్రాక్ట్ లు ఈ సంవత్సరం చివరి కల్లా పూర్తయిపోవాలని ముందుగానే సూచించారట. 

 

ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఐలాండ్ వేకేషన్ కోసం విదేశాలకు వెళ్లానవసరం లేదు. లగ్జరీతో కూడిన వాటర్ విల్లాలు మరికొద్ది రోజుల్లోనే స్వాగతమిచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. సముద్రాల్లో నిర్మిస్తున్న పర్యాటకులను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటున్నాయి.