Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!

సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగిన ఆహారమైనందున గుండె జబ్బులతో బాధపడే వారు కూడా పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరగుతుంది.

Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!

Mushrooms

Mushrooms : మంచి ఔషధ గుణాలు కలిగిన సహజసిద్ధమైన ఆహారం పుట్టగొడుగు. పూర్వ కాలం నుండి పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవటం అలవాటుగా వస్తోంది. వైవిధమైన ఈ పుట్టగొడుగుల ఆహారంపై ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. వర్షాకాలం వచ్చిందంటే పొలాల్లో, కాలువల వెంట పొట్టగొడుగులు విరివిగా లభిస్తాయి. ఇటీవలి కాలంలో పుట్టగొడుగుల పెంపకం చేపడుతున్నారు. దీంతో అన్ని కాలాల్లో పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి. పుట్టగొడుగులను చాలా మంది మాంసాహారంగా భావిస్తారు. పుట్టగొడుగులలో 80 నుండి 90 శాతం వరకూ నీరు ఉంటుంది. వారానికి రెండుమూడు సార్లు తింటే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. మధుమేహులకు ఇదొక మంచి ఆహారమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగిన ఆహారమైనందున గుండె జబ్బులతో బాధపడే వారు కూడా పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరగుతుంది. కొలెస్ట్రాల్ అనేది ఉందడు. మొటిమలు, యాక్నె సమస్యలతో బాధపడేవారు.. పుట్టగొడుగుల పొడితో ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓ టీస్పూన్ మష్రూమ్ పొడికి, మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్, రెండు చుక్కల నూనె, అరటీ స్పూన్ నిమ్మరసం కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే పుట్టగొడుగులు రొమ్ము మరియు ఇతర హార్మోన్-సంబంధిత క్యాన్సర్‌ల నుండి రక్షణ కల్పిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే అవి ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేసే ఆరోమాటేస్ అనే ఎంజైమ్‌ను నిరోధిస్తాయి. ఆరోమాటేస్‌ను నిరోధించే అతి తక్కువ ఆహారాలలో పుట్టగొడుగులు ఒకటి. పుట్టగొడుగులు క్యాన్సర్ కణాలను గుర్తించే ప్రత్యేకమైన లెక్టిన్‌లను కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా, విభజించకుండా నిరోధించబడతాయని అధ్యయనంలో తేలింది.