Iron Deficiency : జ్యూస్ లతో ఐరన్ లోపాన్ని అధిగమించండిలా!..

విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లలో ఆరెంజ్‌ ఒకటి. నారింజ జ్యూస్‌ను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో సిట్రస్‌ కూడా ఉన్నందున చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Iron Deficiency : జ్యూస్ లతో ఐరన్ లోపాన్ని అధిగమించండిలా!..

Iron

Iron Deficiency : మానవ శరీరంలో ఎన్నో ఎంజైమ్లు, రసాయానాలు సమాహారం. ప్రతి అవయవానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు లభిస్తేనే సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ మానవస శరీరానికి ఉపయోగపడే ఖనిజాల్లో అతి ముఖ్యమైంది. ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నప్పుడు ఇనుము ఎంతో ఉపయోగపడతుంది. హీమోగ్లోబిన్ తయారీ, ఎర్రరక్తకణాలకు ప్రోటీన్ ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హీమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే మానవ కండరాలకు, అవయవాలకు తగిన ఆక్సిజన్ అందక అంత ప్రభావవంతగా పనిచేయవు.

ఐరన్ డిఫెషియన్సీ రక్తహీనత కలిగే తీవ్ర అనారోగ్యం కలిగే ప్రమాదముంది. శరీరానికి ఇతర పోషకాలు మాదిరిగానే ఐరన్‌ కూడా చాలా అవసరం. లోపం కారణంగా రక్తహీనత, జుట్టు రాలడం, నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ఐరన్‌ లోపంతో బాధపడుతుంటారు. అందుకే ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఐరన్‌ స్థాయిలను పెంచడానికి డైట్‌లో ఫుడ్‌ మాత్రమే కాకుండా పలు రకాల జ్యూస్‌లనూ తీసుకోవాలి. విటమిన్‌-సి అధికంగా ఉండే జ్యూస్‌లు రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడతాయి.

ఐరన్‌ లోపాన్ని అధిగమించడంలో భాగంగా పండ్లను జ్యూస్‌ల రూపంలో ఆహారంలోకి చేర్చడం సరైన మార్గం. ఐరన్ అధికంగా ఉండే పాలకూర జ్యూస్‌కు ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. పాలకూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇనుముతో పాటు, ఇందులో విటమిన్‌ టి,హెచ్‌, జడ్‌, బి6, బి2, కె, ఇ, రాగి వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. దోసకాయ, పాలకూర కలిపిన జ్యూస్‌ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్‌రూట్‌లో విటమిన్‌ సి, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఉప్పు, మిరియాలు కలిపి బీట్‌రూట్‌ జ్యూస్‌ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరగా ఉంటుంది.

విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లలో ఆరెంజ్‌ ఒకటి. నారింజ జ్యూస్‌ను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో సిట్రస్‌ కూడా ఉన్నందున చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని మెరుగుపరుస్తుంది. కొన్ని పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ, పుదీనా ఆకులను తీసుకొని.. వాటికి తేనె, ఉప్పు, నిమ్మరసం కూడా జోడించి జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల ఐరన్‌ పుష్కలంగా లభిస్తోంది.

పైనాపిల్‌, ఆరెంజ్‌, పొట్లకాయతో తయారు చేసిన ఈ జ్యూస్‌ బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా. నారింజ, పైనాపిల్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అది శరీరంలో ఐరన్‌ శాతాన్ని పెంచుతుంది. నారింజ, పైనాపిల్స్ విటమిన్ సికి మంచి వనరులు. అవి శరీరంలో ఐరన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.