Flour Biscuits : మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు అతిగా తింటున్నారా? ఆరోగ్యానికి హానికరం జాగ్రత్త!

ఆకలైతే మైదా పిండితో తయారైన బిస్కెట్లు తినటం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నట్లే. బేక్ చేసిన పదార్ధాలు తినటం ఆరోగ్యానికి ఏమంత శ్రేయస్కరం కాదు. బిస్కెట్ల‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతుంది.

Flour Biscuits : మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు అతిగా తింటున్నారా? ఆరోగ్యానికి హానికరం జాగ్రత్త!

Overeating flour biscuits? Harmful to health!

Flour Biscuits : బిస్కెట్లను సహజంగా మైదా పిండి, చక్కెరతో తయారు చేస్తారు. మైదా పిండి సకల అనారోగ్యాలకు కారణం. ఇక దానికి చక్కెర కలిపితే చెప్పాల్సిన పనిలేదు. బరువు పెరగటంతోపాటు స్ధూలకాయం వంటి సమస్యలు వచ్చేస్తాయి. చాలా బిస్కెట్లు శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. శుద్ధి చేసిన పిండి లేదా మైదా అనారోగ్యకరమైనది. దీని వలన ఇన్సులిన్ అధిక మోతాదు ఉత్పత్తికి కారణమవుతుంది. దీర్ఘకాలంలో ఇది ఇన్సులిన్ నిరోధకత, మధుమేహానికి కారణమవుతుంది.

సాధారణ బిస్కెట్లు పామాయిల్, సోడియం, ప్రిజర్వేటివ్‌ల అధిక వినియోగం వల్ల అనేక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఒక కప్పు టీ లేదా కాఫీతో కూడిన చిరుతిండికి బిస్కెట్లు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అయినప్పటికీ, ఈ బిస్కెట్లలో చక్కెర, ఉప్పు, చెడు కొవ్వులు, శుద్ధి చేసిన గోధుమలలో కేలరీలు వుంటాయి. ఇలాంటి బిస్కెట్లు తినటం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఇది అధిక మొత్తంలో సోడియం కారణంగా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి కారణమవుతుంది. బిస్కెట్లలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉండి బరువు పెరిగేలా చేస్తాయి.

ఆకలైతే మైదా పిండితో తయారైన బిస్కెట్లు తినటం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నట్లే. బేక్ చేసిన పదార్ధాలు తినటం ఆరోగ్యానికి ఏమంత శ్రేయస్కరం కాదు. బిస్కెట్ల‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రోజువారిగా బిస్కెట్లు తినటం వల్ల జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఒక వేళ బిస్కెట్లు తినాలని పిస్తే ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మ‌ల్టీ గ్రెయిన్ పిండి లేదా రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌లు వంటి చిరుధాన్యాల పిండిల‌తో బిస్కెట్లను త‌యారు చేస్తున్నారు. ఈ బిస్కెట్ల‌ను తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆరోగ్యాంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.