Papaya Face Cream : చర్మ సంబంధిత సమస్యలను నివారించటంతోపాటు ముడతలు,మచ్చలు తొలగించే బొప్పాయి ఫేస్ క్రిమ్!

చర్మ సౌందర్యాన్ని పెంచడానికి బాగా పండిన బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా బాగా పండిన బొప్పాయిని తీసుకోవాలి. బొప్పాయిలో విటమిన్ ఎ, పెఫైన్ అనే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చర్మంలోని మృతకణాలను ను తొలగిస్తాయి.

Papaya Face Cream : చర్మ సంబంధిత సమస్యలను నివారించటంతోపాటు ముడతలు,మచ్చలు తొలగించే బొప్పాయి ఫేస్ క్రిమ్!

Papaya face cream that prevents skin related problems and removes wrinkles and spots!

Papaya Face Cream : బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి. బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేస్తుంది. స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

చర్మ సౌందర్యానికి బొప్పాయి ;

బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లలో ఉండే రసాయనాలు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. దాంతో చర్మం సహజసిద్ధమైన నిగారింపును కోల్పోతుంది. చర్మ నిగారింపుకు బొప్పాయి ఫేషియల్స్ ఉపయోగపడతాయి. బొప్పాయి ఫేషియల్స్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని బ్యూటీషియన్స్ చెబుతున్నారు.

చర్మ సౌందర్యాన్ని పెంచడానికి బాగా పండిన బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా బాగా పండిన బొప్పాయిని తీసుకోవాలి. బొప్పాయిలో విటమిన్ ఎ, పెఫైన్ అనే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చర్మంలోని మృతకణాలను ను తొలగిస్తాయి. ఈ ఫేషియల్ మొటిమలను , మొటిమల ద్వారా ఏర్పడే మచ్చలను తగ్గిస్తాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను పోగొడతాయి. చర్మంకు కావలసిన తేమను అందించి చర్మం నిగనిగలాడుతూ ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా బొప్పాయితో ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని రోజు వాడితే వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

బొప్పాయి ఫేస్ క్రీమ్ తయారీ ;

ముందుగా దోరగా పండిన బొప్పాయి ని తీసుకోవాలి. పై తొక్క, లోపల ఉండే గింజలు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బొప్పాయి మిశ్రమాన్ని వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకుని తర్వాత మరో గిన్నెను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి ఆయిల్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని ఐదారు నిమిషాల పాటు మిక్స్ చేస్తే బొప్పాయి ఫేస్ క్రీమ్ రెడీ అయినట్లే. ఈ క్రీమ్ ను ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. తద్వారా చర్మం తెల్లగా , కాంతివంతంగా మారుతుంది.