High Blood Pressure : హైబీపీ ఉన్నవారు… ఆహారంగా!…

ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలు అధిక బీపీని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తాయి. వీటిలో ఉండే నైటేట్స్ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపకరిస్తాయి.

High Blood Pressure : హైబీపీ ఉన్నవారు… ఆహారంగా!…

Blood Pressure

High Blood Pressure : మారిన జీవిన విధానం, ఆహారపు అలవాట్లు అనేకరకమైన ఆరోగ్య సమస్యలకు కారణమౌతున్నాయి. అలాంటి ఆరోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. అధిక రక్తపోటు తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. సైలెంట్ కిల్లర్ గా మారి శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు రక్తనాళాలు దెబ్బతిని వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం హైబీపీ సమస్య అందరిలో సాధారణ సమస్యగా కనిపిస్తోంది. అధిక రక్తపోటు చాలా ప్రమాదకరమైంది.

హైబీపీ ఉన్నవారు సరైన చికిత్స పొందటంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. దీంతో బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. దీని వల్ల హైబీపీని కంట్రోల్ లో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. హైబీపీతో బాధపడుతున్నవారు రోజు వారి ఆహారంలో ఓట్స్ చేర్చుకోవాలి. ఓట్స్ లో బీటా గ్లూకెన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. ఉదయానే అల్పాహారంగా ఓట్ మీల్ తింటే చాలా మంచిది.

హైబీపీ బాధపడే వాళ్లు రోజూ బీట్ రూట్ జ్యూస్ మేలు చేస్తుంది. నాలుగు వారాల పాటూ రోజుకు ఒక కప్పు బీట్ జ్యూస్ తాగితే హైబీపీ నియంత్రణలోకి వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. హైబీపీని నియంత్రించటంలో అరటి పండు ఔషదంలా పనిచేస్తుంది. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుది. ఒక మీడియం సైజు అరటిపండులో ఉండే పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గించవచ్చు.

రోజుకో కివీ పండు తింటే హైబీపీ తగ్గుతుంది. రోజుకు మూడు కివీలు ఎనిమిది వారాల పాటూ తింటే సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటులో తగ్గుదల కనిపిస్తుందని పరిశోధనలు నిర్ధారించాయి. బెర్రీ జాతి పండ్లు తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. వీటిలో యాంథోసైనిన్లు అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు బీపీని తగ్గించటంలో దోహదం చేస్తాయి. కోకో ఉన్నడార్క్ చాక్లట్ ను రోజూ తినడం ద్వారా హైబీపీని తగ్గించుకోవచ్చు. ప్రీ హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ ఉన్నవారిలో డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఉపయోగం ఉంటుంది. సాల్మన్ చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాట్టి ఆమ్లాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలు అధిక బీపీని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తాయి. వీటిలో ఉండే నైటేట్స్ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపకరిస్తాయి. పాలకూర, క్యాబేజీ,గ్రీన్స్ వంటి ఆకుకూరలలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును తగ్గించటంలో సహాయపడతాయి. ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్ రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సహాయ పడతాయి.వెల్లుల్లి, పుచ్చకాయ, దానిమ్మ, దాల్చినచెక్క, పిస్తా, పప్పులు సైతం హైబీపీని నియంత్రించటంలో దోహదం చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో అవిసె గింజలు శక్తివంతమైన సూపర్ ఫుడ్ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల సలహాలు పాటిస్తూ వారిచ్చే సూచనలు పాటించి ఆహారాలు తీసుకోవటం మంచిది. ఈ కథనంలో అంశాలు, సూచనలు కేవలం అవగాహన కల్పించడం కోసమేనని గమనించాలి.