Peanuts : పోషకాలు పుష్కలంగా..ఆరోగ్యం పదిలంగా

పల్లీలు శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు.

Peanuts : పోషకాలు పుష్కలంగా..ఆరోగ్యం పదిలంగా

Peanuts : వేరుశనగలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందన్న కారణంగా చాలా మంది వీటిని తినేందుకు ఆసక్తి చూపించరు. అయితే రోజు వారిగా మితంగా వీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. చాలా మంది పల్లీలను చెక్క రూపంలో బెల్లంతో కలిపి తీసుకుంటారు. మరికొందరు చట్నీ చేసుకుని తింటారు. వీటిని తినడం వల్ల విటమిన్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ శరీరానికి అందుతాయి.

పల్లీలు శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ప్రొటీన్లు మైండ్ చురుగ్గా పని చేయటంలో దోహదం చేస్తాయి. ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా వేరుశెనగలు సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.

వేరుశనగలో ప్రోటీన్స్,యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లలో సరైన ఎదుగుదలకు సహయపడుతుంది. వేరుశనగలోని ఇనుము రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. వేయించినవి కాకుండా ఉడికించినవి తింటే పీచు పదార్దం అధికంగా శరీరానికి అందుతుంది. వీటిలో ఉండే పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. కాబట్టి పోషకాలు పుష్కలంగా లభించే వేరుశనగ గింజలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.