Ragi Flour : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచే రాగిపిండి!

రాగి జావను తీసుకోవడం శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

Ragi Flour : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచే రాగిపిండి!

ragi flour

Ragi Flour : శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం, గుండె సమస్యలు, డయాబెటిస్, బిపి ఇలా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక చెడు కొలెస్ట్రాల్ లేకుండా రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండే కొన్ని రకాల ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి మనల్ని బయటపడేస్తాయి.

అలాంటి వాటిలో రాగిపిండితో తయారైన ఆహారపదార్ధాలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయటంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుతాయి. రాగి పిండిలో మన శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల, పోషకాహార లోపం, ప్రాణాంతకమైన రోగాలు మరియు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.

రాగి జావను తీసుకోవడం శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇందులో అమినోయాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం ఉండటం వల్ల రాగి పిండితో తయారు చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి కావటాన్ని తగ్గిస్తుంది. తద్వారా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ అనే ఆమైనోఆసిడ్స్ కలిగి ఉండడం వల్ల కాలేయంలోని చెడు కొలెస్ట్రాలను తొలగించడం ద్వారా అధికంగా ఉన్న కొలెస్ట్రాలను కరిగిస్తుంది.వీటితోపాటు అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలు మరియు దంతాల పట్టుత్వానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనితో తయారుచేసే ఆహారాలు పిల్లలకు తర్చుగా ఇవ్వడం వల్ల వారికి ఎదుగుదల లోపాలు తొలగిపోతాయి. రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుతాయి.

రాగుల్లో ఉండే అమినినో యాసిడ్స్ మరియు మెతియోనిన్ , స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క ఫ్లెక్సిబిలిటిని పెంచతుుంది. రాగులతో తయారు చేసే మొలకలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కూడా అందంగా, మృదువుగా మారుతుంది. రాగుల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. అందువల్ల ఇది రక్తహీనత సమస్య తో బాధపడేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాగుల్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ జీర్ణశక్తిని పెంచుతుంది, బ్లడ్ షులర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. గ్లిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.