రీస్లైకింగ్ చేద్దాం.. స్వచ్ఛ భారత్‌గా మారుద్దాం : 78టన్నుల ప్యాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలతో రిలయన్స్ రికార్డ్

  • Published By: sreehari ,Published On : November 9, 2019 / 12:21 PM IST
రీస్లైకింగ్ చేద్దాం.. స్వచ్ఛ భారత్‌గా మారుద్దాం : 78టన్నుల ప్యాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలతో రిలయన్స్ రికార్డ్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ (RIL) మరో అడుగు ముందుకేసింది. టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తోంది. ఇప్పటివరకూ 78 టన్నుల ప్యాస్టిక్ బాటిళ్లను సేకరించి RIL రికార్డు సృష్టించింది. రీసైక్లింగ్ ఫర్ లైప్ క్యాంపెయిన్ కింద రిలయన్స్ ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలను సేకరిస్తోంది. ఇందులో స్వచ్చంధంగా ఎంతోమంది పాల్గొని టన్నుల కొద్ది ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలను సేకరించారు. 

రిలయన్స్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు, రిలయన్స్ వ్యాపార భాగస్వాములు, జియో, రిలయన్స్ రిటైల్ సంస్థ ఉద్యోగులతో కలిపి మొత్తం 3 లక్షల మంది ఉద్యోగుల సహకారంతో ఈ అరుదైన రికార్డును సాధించారు. స్వచ్ఛత అనే సందేశాన్ని అందరికి తెలియజేసేలా ఈ ప్రచారాన్ని రిలయన్స్ విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రచారంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతూ అంబానీ, డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియో ఇషా అంబానీ పాల్గొన్నారు. వేస్ట్ బాటిళ్ల స్టాక్ ను తమ ఉద్యోగులతో కలిసి సేకరించే కార్యక్రమంలో తమ వంతు సాయం అందించారు. 

RIL సైక్లింగ్ యూనిట్ లో సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రాసెస్ లో నీతూ అంబానీ పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన రీసైక్లింగ్ 4 లైప్ క్యాంపియన్ ఇదొక భారీ క్యాంపియన్ గా అక్టోబర్ నెలలో పూర్తి అయింది. రిలయన్స్ కంపెనీలోని ఉద్యోగులంతా తమ నివస ప్రాంతాల్లోని ప్యాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఆఫీసుకు తీసుకొచ్చారు. 

ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా తమ కంపెనీల్లోని ఉద్యోగులతో కలిసి రిలయన్స్ స్వచ్ఛత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా నీతూ అంబానీ మాట్లాడుతూ.. మన పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి ముఖ్యమైన బాధ్యతగా ఆమె పిలుపునిచ్చారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని ప్రతిఒక్కరికి అవగాహన కల్పించేలా సందేశాన్ని పంపుతున్నట్టు ఆమె తెలిపారు.