Condom In Lungs : ఊపిరితిత్తుల్లో తెల్లగా ఉంటే TB అనుకుంది.. కండోమ్ అని తెలిసి.. షాక్!

ఆమె ఊపిరితిత్తుల్లో కుడివైపు భాగంలో ఒక పుండులా కనిపించింది. మరింత పరీక్షించగా.. ఒక బ్యాగ్ మాదిరి పలచటి పొరలా కనిపించింది. మిస్టరీయస్ గా ఉన్న ఆ బ్యాగును వైద్యులు తొలగించారు. అది కండోమ్ అని తెలిసి షాక్ అయ్యారు.

Condom In Lungs : ఊపిరితిత్తుల్లో తెల్లగా ఉంటే TB అనుకుంది.. కండోమ్ అని తెలిసి.. షాక్!

Shocking

Condom In Her Lungs : క్షయ (ట్యుబర్‌ క్లోసిస్‌) (TB) ఇదో ప్రాణాంతక వ్యాధి.. ఊపిరితిత్తుల్లో సోకి దెబ్బతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడి ఇంకా ఏడాదికి మిలియన్ల మంది మృత్యువాత పడుతూనే ఉన్నారు. మూడో వంతు జనాభాలో ఈ టీబీ బ్యాక్టీరియా బారినపడుతున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండే 45శాతం మంది టీబీ బాధితులు మరణించే అవకాశం ఉంది. హెచ్ఐవీ పాజిటివ్ బాధితులు తొందరగా ఈ క్షయ వ్యాధి బారినపడే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

ఇదిలా ఉంటే.. 27ఏళ్ల మహిళ గత ఆరు నెలలుగా నిరంతర దగ్గు, జ్వరం, మందటి కఫంతో బాధపడుతోంది. చివరికి ఆస్పత్రిలో చేరింది. నాలుగు నెలలు పాటు ఆస్పత్రికి వెళ్తూ యాంటీబయోటిక్స్, యాంటీ ట్యూబర్ క్లోసిస్ ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఆమెకు ఎలాంటి టీబీ లక్షణాలు లేకపోయినప్పటికీ ఈ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉంది. కొన్నిరోజుల తర్వాత ఆమె కఫాన్ని టీబీ పరీక్ష కోసం పంపారు. ఆ టెస్టులో ఆమెకు టీబీ నెగటివ్ అని వచ్చింది.

అలాగే మహిళ ఛాతిని స్కానింగ్ చేయడగా.. ఆమె ఊపిరితిత్తుల్లో కుడివైపు భాగంలో ఒక పుండులా కనిపించింది. కానీ, మరింత పరీక్షించగా.. ఒక బ్యాగ్ మాదిరి పలచటి పొరలా కనిపించింది. మిస్టరీయస్ గా ఉన్న ఆ బ్యాగును వైద్యులు తొలగించారు. చాలావరకు అది దెబ్బతిన్నప్పటికీ అదేంటో వైద్యులు గుర్తించారు. అది కండోమ్ అని తెలిసి షాక్ అయ్యారు. దాంతో భార్యాభర్తలను ఇద్దరిని పిలిచి వైద్యులు ఎగ్జామిన్ చేశారు. ఇద్దరు రొమాన్స్ చేస్తున్న సమయంలో కండోమ్ తాను మింగేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు.

అప్పటినుంచి ఆమె అదేపనిగా తుమ్మడం లేదా దగ్గడం చేస్తోంది. ఈ క్రమంలో లంగ్స్ లోకి చేరిన కండమ్ చిరిగిపోయి ఊపరితిత్తులను నేరుగా దెబ్బతినడానికి కారణమై ఉండొచ్చునని వైద్యులు నమ్ముతున్నారు. కండమ్ ఎలస్టిక్ కావడంతో లంగ్స్ ఇన్ఫెక్షన్లకు దారితీసిందని చెబుతున్నారు. కండోమ్ నోటి లోపలికి వెళ్లిన విషయం దంపతులు వైద్యుల ముందు దాచిపెట్టినట్టు తెలిపారు. కండోమ్ అడ్డుగా ఉండటం వల్లే ఆమెకు నిరంతరాయంగా దగ్గు వస్తోందని వైద్యులు తేల్చేశారు. చిరిగిపోయిన కండోమ్ చిన్నపాటి ముక్కలను ఆమె ఊపిరితిత్తుల్లో మిగిలాయి. వాటిని తొలగించాలంటే బ్రోనోస్కోపీ చేయాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.