Lose Belly Fat Week : మీ బొజ్జలో కొవ్వును వారంలో కరిగించే 9 అద్భుత చిట్కాలు.. ట్రై చేయండి!

అధిక బరువుతో బాధపడుతున్నారా? బానపొట్ట (Belly Fat) సమస్య నుంచి వారంలో బయటపడాలంటే ఈ 9 సింపుల్ టిప్స్ ట్రై చేయాలంటున్నారు పోషక నిపుణులు. బానపొట్ట కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

10TV Telugu News

Lose Belly Fat Week : అధిక బరువుతో బాధపడుతున్నారా? బానపొట్ట (Belly Fat) సమస్య నుంచి వారంలో బయటపడాలంటే ఈ 9 సింపుల్ టిప్స్ ట్రై చేయాలంటున్నారు పోషక నిపుణులు. బానపొట్ట కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సౌకర్యవంతంగా ఉండదు. శారీరకంగానూ మానసికంగానూ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బాడీ ప్యాట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. అందులో ఒకటి చర్మం కింది కొవ్వు.. దీన్నే subcutaneous అని కూడా పిలుస్తారు. మరొకటి (visceral fat) విసెరల్ కొవ్వు పొత్తికడుపు స్థావరంలో ఉంటుంది. ఉదరం చుట్టూ ఆర్గాన్స్ ఉండేచోట ఈ కొవ్వు ఎక్కువగా పెరుకుపోతుంది.

అధ్యయనం ప్రకారం.. ఈ రకమైన కొవ్వు.. గుండెజబ్బులు, అధిక రక్తపోటు, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ బెల్లీ ప్యాట్ అతి తక్కువ సమయంలో తగ్గించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు రెండు విషయాల్లో మార్పులు చేస్తే తొందరగా కొవ్వును కరిగించుకోవచ్చు. వారంలో బెల్లీ ప్యాట్ కరిగిపోవాలంటే ఈ కింది 9 సింపుల్ టిప్స్ పాటించండి.

1. వ్యాయామం :
వ్యాయామం ద్వారా కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు. మీ కడుపుపై పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే situps లేదా crunches వంటి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాల ద్వారా మీ పొట్ట కండరాలను బలంగా చేస్తాయి.

2. కార్డియో :
ఈ కార్డియో వ్యాయామాన్ని రెగ్యులర్ గా చేయడం ద్వారా పొట్టభాగంలో కొవ్వును కరిగించవచ్చు. ఏరోబిక్ ఎక్సరసైజ్ కూడా చేస్తుండాలి. కనీసం 30 నిమిషాల వరకు చేస్తుండాలి. లేదంటే 60 నిమిషాల వరకు కొనసాగించవచ్చు. అది తగ్గించుకునే కొవ్వను బట్టి నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా అధిక బరువుతో పాటు అనేక కేలరీలను కరిగించుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్ సైజుతో వారంలోగా పొట్ట కొవ్వును కరిగించుకునే అవకాశం ఉంటుంది. కార్డియో అంటే చాలామంది పరిగెత్తడం అనుకుంటారు. బరువు తగ్గడానికి పరిగెత్తనవసరం లేదని గుర్తించుకోవాలి. స్విమ్మింగ్, బైకింగ్, జంపింగ్ రోప్, డాన్సు క్లాసెస్, పవర్ వాకింగ్ వంటి కార్డియో ఎక్సర్ సైజుల ద్వారా ఈజీగా బెల్లీ ప్యాట్ మటుమాయమైపోతుంది.

3. కండలు పెంచండి :
ఈ బెల్లీ ప్యాట్ తగ్గించుకోవాలంటే మజిల్స్ పెంచండి.. మెటాబాలిజాన్ని మెరుగుపర్చడం ద్వారా కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. మజిల్స్ పెంచుకోవడం ద్వారా ఎక్కువ శాతం కేలరీలను కరిగించుకోవచ్చు. వెయిట్ లిఫ్టింగ్ వంటి చేయాలి. ఇంట్లో లేదంటే జిమ్ కు వెళ్లి పర్సనల్ ట్రైనర్ సూచనల మేరకు (squats, lunges, planks, sit-ups, abdominal crunches) బాడీ వెయిట్ ఎక్సరసైజులు చేయాలి.

4. డైట్ ( ఆహారం) :
బెల్లీ ప్యాట్ దీర్ఘకాలం రాకుండా ఉండాలంటే.. డైట్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ప్రతిరోజు మీరు తినే విధానంలో మార్పులు చేసుకోవాలి. మీరు తినే ఆహారంపైనే ప్యాట్ ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే ఫుడ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాట్ లేని ఫుడ్ తీసుకోవడం చేయాలి.

5. చక్కెర పానీయాలకు దూరం :
చక్కెరతో నిండిన పానియాలు తీసుకోవడం వల్ల కూడా ప్యాట్ పెరిగే అవకాశం ఉంది. చాలావరకు పండ్ల జ్యూసుల్లో షుగర్ కూడా ఉంటుంది. ఇతర డ్రింక్స్ లో కూడా షుగర్ కంటెంట్ నిండి ఉంటుంది. స్పోర్ట్స్ డ్రింక్స్, స్వీటెండ్ కాఫీ, బాటిల్ టీలలో చక్కరె కంటెంట్ ఉంటుంది. ఆల్కాహాల్ లో కూడా షుగర్ ఉంటుంది. తొందరగా పొట్ట తగ్గాలంటే ఆల్కాహాల్ తాగడం తగ్గించాలి. కాక్ టెయిల్స్, ఫ్రూట్ జ్యూస్ లేదా సోడా ద్వారా బరువు పెరిగిపోవచ్చు. అందుకే అవసరంలేని వాటికి దూరంగా ఉండటమే మేలు. ఇలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి.

6. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి :
మీ ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోవలసిన అవసరం లేదు. కానీ ప్రోటీన్ చేర్చుకోవడం అనేది బరువు తగ్గించుకోవచ్చు. ప్రోటీన్ తీసుకోవడం ద్వారా ఆకలిని తగ్గుతుంది. ఎక్కువగా తినాలనే కోరిక ఉండదు. ఫలితంగా కొవ్వు తగ్గిపోతుంది. అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి. హెల్తీ ప్రోటీన్ దొరికే వాటిలో చికెన్, లీన్ మీట్, ఫ్యాటీ ఫిష్, గుడ్లు, సీడ్స్, లెంటిల్స్, బీన్స్ వంటి తీసుకోవడం ద్వారా తక్కువగా తింటారు. కూరగాయలు, గుడ్లు, గ్రీకు తాజా పండ్లుతో పెరుగు, ప్రోటీన్ స్మూతీస్ ప్రోటీన్ పౌడర్, పాలకూర, పండు వంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

7. మీ ఆహారంలో ఫైబర్‌ చేర్చండి :
పొట్టలోని కొవ్వును తగ్గించుకోవడానికి ఫైబర్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఫైబర్ కంటెంట్ మీ జీర్ణవ్యవస్థ మందగించడానికి పోషకాలను గ్రహించడానికి సాయపడుతుంది. జీర్ణవ్యవస్థ మందగించినప్పుడు ఆకలి తగ్గుతుంది. తక్కువ కేలరీలు తినేందుకు సాయపడుతుంది. ఎక్కువ ఫైబర్ పొందడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా సూచిస్తున్నారు. కూరగాయలు చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. ఆకు కూరలు, పండ్లు, కాయలు, గోధుమ బియ్యం వంటి కొన్ని తృణధాన్యాలు ఫైబర్ పవర్‌హౌస్‌లు వారంలో కొవ్వును తగ్గించగలవు.

8. ఇంట్లోనే ఫుడ్ రెడీ చేసుకోండి :
రెస్టారెంట్ల నుంచి ప్రాసెస్ చేసిన ఆహారాలు జంక్ ఫుడ్‌లో అదనపు చక్కెర, ఉప్పులో ఫ్యాట్ ఉంటాయి. ఈ మూడింటితో వారంలో పొట్టలో కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే వంట చేసుకుని తినండి. బయటి ఫుడ్ కంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. కొవ్వు తగ్గడానికి కావలసిన పోషకాలను సరైన మొత్తంలో పొందవచ్చు. పాస్తాను వెజ్జీ నూడుల్స్‌తో, చక్కెరతో కూడిన తృణధాన్యాలు, కాటేజ్ చీజ్ తాజా పండ్లతో వైట్ రైస్‌ను క్వినోవాతో తీసుకోవచ్చు. ఒక
వారంలో కొవ్వు తగ్గించడానికి మరో చిట్కా ఉంది.. ఉప్పును దూరం పెట్టడమే.. ఉప్పు మీ శరీరం నీటిని, పొట్ట ఉబ్బరానికి కారణమవుతుంది. ఉప్పు స్థానంలో పెప్పర్ వంటి మసాలా దినుసులను చేర్చండి.

9. తగినంత నిద్రపోండి :
రోజువారీ వ్యాయామంతో పాటు పోషకాహారం తీసుకోవడం ద్వారా కొవ్వును త్వరగా వదిలించుకోవచ్చు. అలాగే రోజూ తగినంత నిద్రపోవాలి. నిద్రలేమి కారణంగా అనేక వ్యాధులు వస్తాయి. నిద్ర సరిగా లేకపోవడం వల్ల బరువు పెరగడం అధిక ఒత్తిడికి దారితీస్తుంది. నిద్ర కోల్పోవడం వల్ల మీ శరీరంలో శక్తిని కోల్పోతారు. ఫలితంగా అనేక సమస్యలకు దారితీస్తుంది.

10TV Telugu News