Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!

ఉదయం సమయంలో అల్పాహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ సలహాను తీసుకుని చాలా మంది మసాలా, నూనె కలిపిన వేపుళ్లు, ఆహారపదార్ధాలను ఉదయం అల్పాహారంగా లాగించేస్తుంటారు.

Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!

Illness

Small Mistakes : మారిన జీవనశైలి , ఉరుకుల పరుగుల జీవితం వెరసీ ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో, దాని వల్ల ఆరోగ్యానికి ఏమి మేలు కలుగుతుందో నన్న కనీసం అవగాహన చాలా మందిలో ఉండటంలేదు. పని బిజీలో పడి తీసుకునే ఆహారం గురించి పదినిమిషాలు కూడా ఆలోచించలేని పరిస్ధితి నెలకొంది. ఆహారం, ఆరోగ్యం విషయంలో చేసే ఈ చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అనారోగ్యాలు దరి చేరుతాయి.

చాలా మంది నిద్రలేవగానే టీ, కాఫీలు తాగేస్తుంటారు. వీటి వల్ల శరీరంపై తీవ్రప్రభావం పడుతుందని ఆలోచించటరు. వీటిలో ఉండే కెఫిన్ శరీరంలోకి వెళ్లి శరీరానికి హానికలిగిస్తుంది. నిద్రలేవగానే బ్రష్ చేసుకుని రెండు గ్లాసుల నీళ్లు తాగిన తరువాత మాత్రమే తేనీటిని సేవించటం మంచిది. అలా చేయటంవల్ల జీర్ణాశయం శుబ్రమౌతుంది.

ఉదయం సమయంలో అల్పాహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ సలహాను తీసుకుని చాలా మంది మసాలా, నూనె కలిపిన వేపుళ్లు, ఆహారపదార్ధాలను ఉదయం అల్పాహారంగా లాగించేస్తుంటారు. ఇలాంటి ఆహారాలను తీసుకోకపోవటం చాలా మంది. ఉదయం అల్పాహారంగా కీరదోస, పుచ్చకాయ, క్యారెట్లు, మొక్కజొన్న వంటివి తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యార్ధాలను వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బయటకు పంపుతాయి.

భోజనం కూడా ఏదో హడాహుడిగా తినేస్తుంటారు. స్పీడుగా భోజనాన్ని ముగించటం వల్ల తినే సమయంలో గాలి లోపలికి వెళ్లి కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. వేగంగా తినటం వల్ల జీర్ణ శక్తి మందగిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. రోజులో ఎలాంటి ఆహారం తీసుకున్నా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల జీర్ణ క్రియలు సాఫీగా జరుగుతాయి.