Winter Diet : చలికాలంలో ఈ ఆహారాలతో అనారోగ్య సమస్యల ముప్పు!

చలికాలంలో వీలైనంత వరకు పెరుగు తీసుకోవటం తగ్గించాలి. శీతాకాలంలో పెరుగు తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు మరియు తలనొప్పికి కారణమవుతుంది.

Winter Diet : చలికాలంలో ఈ ఆహారాలతో  అనారోగ్య సమస్యల ముప్పు!

winter diet

Winter Diet : చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చర్మ సమస్య మొదలుకొని శ్వాస తీసుకోవడం, ఆస్తమా, జలుబు, జలుబు మరియు కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఆహారం మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ హానికరమైన ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవడం మానుకోవాలని అంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు అధికంగా విజృంభిస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా చల్లగా ఉండటంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా ఉండి, జలుబు, చలితో బాధపడుతుంటే, కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.

చలికాలంలో వీలైనంత వరకు పెరుగు తీసుకోవటం తగ్గించాలి. శీతాకాలంలో పెరుగు తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు మరియు తలనొప్పికి కారణమవుతుంది. పాలు లేదా పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. సలాడ్లు మరియు పచ్చి కూరగాయలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఈ ఆహారాల వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

ఐస్ మరియు శీతల పానీయాలు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తాగితే ఆరోగ్యానికి అవి హానికలిగిస్తాయి. కార్బోనేటేడ్ పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది తరువాత మధుమేహానికి దారి తీస్తుంది. పండ్ల రసానికి బదులుగా తాజా పండ్లను తినండి. స్వీట్లకు దూరంగా ఉండండి. స్వీట్స్‌ ఎక్కువగా తింటే.. ఇమ్యూనిటీ వీక్‌ అవుతుంది. దీని కారణంగా అనారోగ్యాల బారిన పడం అవకాశం ఉంది.

చలికాలంలో నూనెలో వేయించిన నూనెతో కూడిన ఆహారం, జంక్‌ ఫుడ్‌ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే వీటిని తీసుకోవటం వల్ల గుండెకు హాని చేస్తాయి. చలి కాలంలో గుండె పోటు వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉంటాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం చిక్కబడుతుంది.