Kids : పిల్లలకోసం సమయం కేటాయిచటం అవరమే!

వారంలో ఒక రోజు ఆఫీసు పనులకు దూరంగా ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు సెలవు ప్రకటించాలి. కుటుంబం మొత్తం సరాదాగా కలిసి భోజనం చేయటం, సరదాగా మంచి ప్రదేశాలకు పిల్లలను తీసుకుని వెళ్ళటం వంటివి చేయాలి.

Kids : పిల్లలకోసం సమయం కేటాయిచటం అవరమే!

Kids

Kids : ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు. తమ కుటుంబంలో భాగమైన పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తమ లక్ష్యసాధనకోసం పరుగులు పెడుతుంటారు. పిల్లలతో సరైన సమయం గడిపేందుకు కూడా అవకాశం లేకపోవటం వల్ల అది పిల్లల ఎదుగుదలలో అనేక మార్పులకు కారణమౌతుంది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో మంచి మార్గంలో తీర్దిదిద్లేలేక పోతున్నారు.

కెరీర్, లక్ష్యాలు ఇవన్నీ సాధారణమే అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించాలన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుచుకోవటం మంచిది. జీవితంలో అతిముఖ్యమైన ప్రాధాన్యాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించినా మిగిలిన సమాయాన్ని మాత్రం తమ పిల్లలకు కేటాయించాలన్న విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది. సాయంత్రం ఇంటికొచ్చాక సమయాన్ని పిల్లలతో గడిపేందకు కేటాయించటం మంచిది. పిల్లలతో స్కూల్ హోమ్ వర్క్ లు చేయించటమే కాదు వారితో కాసేపు ఆడుతూ పాడుతూ గడపటం మంచిది.

వారంలో ఒక రోజు ఆఫీసు పనులకు దూరంగా ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు సెలవు ప్రకటించాలి. కుటుంబం మొత్తం సరాదాగా కలిసి భోజనం చేయటం, సరదాగా మంచి ప్రదేశాలకు పిల్లలను తీసుకుని వెళ్ళటం వంటివి చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంత కాలంగా ఏం కోల్పోయామో అర్ధమౌతుంది. ఇంట్లో టీవీలు, కంప్యూటర్, సెల్, లాప్‌టాప్‌ వీడియో గేమ్స్‌లకు అతుక్కుపోవడం ద్వారా పిల్లల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు పిల్లలు అలాంటి వాటికి బానిసలుగా మారకుండా వారికి కొంత సమయం కేటాయించి ఇతరత్రా విషయాల్లో వారు నిమగ్నమయ్యేలా చేయాలి. ఇలా చేయటం వల్ల వారి ప్రవర్త తీరు సరైన మార్గంలో ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.