Tomatoes : టమోటాలను ఆహారంగానే కాదు, సహజ చర్మ సౌందర్యం పెంచుకోవటానికి ఉపయోగించొచ్చు!
చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు అధిక కొవ్వును నివారిస్తుంది. ఒక టమోటాను రెండు భాగాలుగా కట్ చేసి మీ ముఖం మీద రుద్దండి. 15 నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

Tomatoes are not just food but can be used for natural skin beauty!
Tomatoes : టమోటాలతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. టమోటాలు ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్‌ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలను తొలగించడంలో టమోటాలు మెరుగ్గా పనిచేస్తాయి. విటమిన్ ఏ, సి, కె మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి. టమోటా గుజ్జును ముఖంపై అప్లై చేసి, అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం నిగారింపును సొంతం చేసుకుంది. టొమాటోలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది, ఇది శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
టమోటా రసం ముఖం మీద పట్టిస్తే జిడ్డు తగ్గిపోతుంది. ముఖం సహజ కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య సంబంధిత చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. టమోటాను మెత్తగా చూర్ణం చేసి దీనికి బ్రౌన్ షుగర్ కలిపి పట్టిస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. టొమాటోలు చర్మం ఉపరితలంపై అదనపు సెబమ్ తగ్గించడానికి సహాయపడుతుంది.
చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు అధిక కొవ్వును నివారిస్తుంది. ఒక టమోటాను రెండు భాగాలుగా కట్ చేసి మీ ముఖం మీద రుద్దండి. 15 నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కలు, టమోటా జ్యూస్ కలిపి పట్టిస్తే ముఖంపై బ్యాక్టీరియా పోతుంది. పసుపుతో కలిపి పట్టిస్తే చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. టొమాటో పేస్ట్ ను కలబంద జెల్ తో ముఖం మీద రాసుకుని చర్మాన్ని తేమగా చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లమచ్చలు, పిగ్మెంటేషన్ కనిపించదు.
నిమ్మరసంతో కలిపి పట్టిస్తే చర్మం అందంగా, స్మూత్‌గా ఉంటుంది. టొమాటోస్‌లో బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్ ఇ, సి మరియు లైకోపీన్ వంటి శోథ నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. చర్మ చికాకులను తొలగించడానికి తోడ్పడతాయి. ఇదో మంచి మాయిశ్చరైజర్. సూర్యకిరణాలనుంచి కాపాడుతుంది. ప్రతి రోజూ టమోటా రసాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంలో నునుపుదనం వస్తుంది. యాంటీ ఏజింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది.