Tulsi Water Benefits : వైరల్ ఫీవర్, సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడే తులసి నీరు ! ఉదయాన్నే పరగడుపున తాగితే?

వర్షాకాలంలో మనకు రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. అందుకోసం తులసి ఆకులు మరియు పసుపు పొడి ను నీటిలో మరిగించి తాగితే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

Tulsi Water Benefits : వైరల్ ఫీవర్, సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడే తులసి నీరు ! ఉదయాన్నే పరగడుపున తాగితే?

tulsi water benefits

Tulsi Water Benefits : తులసి అనేక వ్యాధులకు దివ్యౌషధం. దీనిలో ఉండే అనేక ఔషదగుణాల కారణంగా దీనిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అనేక అనారోగ్య సమస్యల నివారణకు తులసి ఎంతగానో ఉపకరిస్తుంది. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే వ్యాధుల నుండి రక్షించేందుకు తులసి మంచి ఔషదంగా పనిచేస్తుంది. వైరల్ ఫీవర్ దగ్గు జలుబు లాంటి జబ్బులను ఎదుర్కోవడానికి, మనకు కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచటంలో తులసీ బాగా తోడ్పడుతుంది.

తులసి నీటిని రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల ప్రయోజనాలు ;

1. తులసి శరీర ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచుతుంది. తులసి నీటిని తాగడం ద్వారా, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరంగా ఉంటాయి. మలబద్ధకం , లూజ్ మోషన్ సమస్య కూడా ఉపశమనం కలిగిస్తుంది.

2. బరువు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ తులసి ఆకు తింటే బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు పదార్థాలను కరిగించే గుణాలు దీనిలో ఉన్నాయి.

3. వర్షాకాలంలో మనకు రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. అందుకోసం తులసి ఆకులు మరియు పసుపు పొడి ను నీటిలో మరిగించి తాగితే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

4.తులసి నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఎలాంటి మందులు వాడకుండా చక్కెరను సహజంగా తగ్గించాలి అంటే తులసి నీటిని తాగాలి.

5. కడుపు నొప్పితో బాధపడుతున్న వారికి తులసి నీరు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు మంచినీళ్లలో తులసి ఆకుల రసం, నిమ్మరసం రెండిటినీ కలిపి తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు రెండు మూడు తులసి ఆకులను నోట్లో వేసుకుని నమిలితే అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.

6. తులసి నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా, విషపూరిత పదార్థాలు శరీరం నుండి బయటకు వస్తాయి. వైరల్ సంక్రమణను చాలా వరకు నివారించవచ్చు.

తులసి నీరు తయారీ ;

ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని తులసి ఆకులను వేసి 2-3 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. అనంతరం కిందికి దించి కొద్ది సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, నీటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా తాగాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఇలా సేవిస్తే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు దరిచేరవు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించటం మంచిది.