వెన్నముక, మెడ నరాలు బలపడేలా చేసే వక్రాసనం!

వెన్నెముక బలంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది. మెడ నరాలు బలపడడానికి సహాయపడుతుంది. క్లోమగ్రంధి ఉత్తేజితమై, ఇన్సూలిన్‌ ప్రొడక్షన్‌ పెంచడానికి ఉపకరిస్తుంది. ఈ ఆసనంతో కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరు మెరుగుపడుతుంది. మెడ, భుజాలకు సంబంధించిన కండరాల నొప్పులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి.

వెన్నముక, మెడ నరాలు బలపడేలా చేసే వక్రాసనం!

Vakra Sanam

ఎలాంటి శారీర వ్యాయామం లేకుండా కూర్చుని ఉండేవారికి శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుని పోతుంది. పేరుకుపోయిన కొవ్వును వదిలించుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అలాగే కంప్యూటర్, ల్యాప్ టాప్ లముంగిట ఎక్కువ సమయం గడిపేవారికి వెన్నుముక, మెడనరాలు బలహీనంగా మారతాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగాలో ప్రధానంగా వక్రాసనం రోజువారిగా వేయటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వక్రాసనం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఎలా వేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

వక్రాసనం ఆసనం వేసే విధానం ; నిటారుగా కూర్చోని కుడి కాలుని మడిచి, కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన పెట్టుకోవాలి. కుడిచేయిని శరీరానికి వెనుకాల ఉంచి, శ్వాస వదులుతూ ఎడమచేతితో కుడికాలును చుట్టి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను వెనుకకు తిప్పి దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి. అనంతరం ఎడమ కాలుతో సైతం ఇలాగే చేసుకోవాలి.

వక్రాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

వెన్నెముక బలంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది. మెడ నరాలు బలపడడానికి సహాయపడుతుంది. క్లోమగ్రంధి ఉత్తేజితమై, ఇన్సూలిన్‌ ప్రొడక్షన్‌ పెంచడానికి ఉపకరిస్తుంది. ఈ ఆసనంతో కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరు మెరుగుపడుతుంది. మెడ, భుజాలకు సంబంధించిన కండరాల నొప్పులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని వివిధ ప్రాంతాల్లో కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా నడువద్ద పోగుబడిన కొవ్వు కరిగిపోయేలా చేస్తుంది.

శ్వాసకు సంబంధించిన సమస్యలు, జీర్ణవ్యవస్థకు , మధుమేహం తో బాధపడుతున్న వారికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి. గ్యాస్ స‌మ‌స్యలు తొలగిపోయి జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.

అయితే ఈ ఆసనం వేసే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారు ఆపరేషన్ జరిగిన ఆరు నెలలు వరకు ఈ ఆసనం వేయకూడదు. మహిళలు నెలసరి సమయాల్లో, గర్భీణీలు ఈ ఆసనాలు వేయటం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.